Popular Fitness Influencer: 41 ఏళ్ల వయసులోనే పాపులర్ బాడీ బిల్డర్ మృతి

చేజ్ ఫిట్‌నెస్ ట్రైనర్ గా రాణిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 14 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Popular Fitness Influencer: 41 ఏళ్ల వయసులోనే పాపులర్ బాడీ బిల్డర్ మృతి

Raechelle Chase

Updated On : October 21, 2023 / 4:34 PM IST

Raechelle Chase Dies: న్యూజిలాండ్‌కు చెందిన పాపులర్ బాడీ బిల్డర్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ రేచెల్ చేజ్ (41) మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె కూతురు ఓ ప్రకటన చేసింది. రేచెల్ చేజ్ కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. చేజ్ ఫిట్‌నెస్ ట్రైనర్ గా రాణిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 14 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఫిట్‌నెస్ గురించి స్ఫూర్తివంతమైన పోస్టులు చేస్తుంటుంది. ఆమె మృతికి గల కారణాలపై వివరాలు తెలియరాలేదు. రేచెల్ చేజ్ మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే దీనిపై వివరాలు అందుతాయని న్యూజిలాండ్ న్యాయశాఖ ప్రతినిధి ఒకరు ప్రకటించారు.

రేచెల్ చేజ్ పెద్ద కూతురు అన్నా చేజ్ ఓ ప్రకటనలో… ‘అమ్మ మాకు చాలా మద్దతుగా ఉండేది. చాలా మంచిది. మా ఎదుగుదలకు తోడ్పడుతూ సలహాలు ఇచ్చేది. ఆమెకు ఆశయాలు ఉన్నాయి. వాటి పట్ల నిబద్ధతో ఉంటుంది. అమ్మ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిని అందించింది’ అని పేర్కొంది.

కాగా, రేచెల్ చేజ్ మొదట క్రిస్ చేజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడికి 2015లో విడాకులు ఇచ్చింది. 18 ఏళ్ల వయసు నుంచే రేచెల్ చేజ్ ఫిట్ నెస్ పై ఆసక్తి కనబర్చింది. ఆ రంగంలోనే ఎంతో పేరు తెచ్చుకుంది.

Huge Traffic Jam : దసరా సెలవుల్లో రహదారులపై ట్రాఫిక్ జామ్