దారుణం.. కుక్కల దాడిలో గర్భిణి స్త్రీ మృతి

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 02:50 AM IST
దారుణం.. కుక్కల దాడిలో గర్భిణి స్త్రీ మృతి

Updated On : November 20, 2019 / 2:50 AM IST

ఫ్రాన్స్‌లో దారుణం జరిగింది. కుక్కలు దాడిలో ఓ గర్భిణి స్త్రీ (29) మృతి చెందింది. ఈ విషాద ఘటన ఫ్రాన్స్‌లోని విల్లర్స్ కాటెరెట్స్ పట్టణానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం (నవంబర్ 20, 2019) నాడు  చోటుచేసుకుంది.  

మహిళ తన పెంపుడు కుక్కతో అటవీ ప్రాంతంలో నడుచుకుంటు వెళ్లింది. దారిలో వేరే కుక్కలు వచ్చి ఆమెపై ఒక్కసారిగా దాడికి దిగాయి.  ఆ మహిళ తన భర్తకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది, అతను వచ్చేలోగా మహిళ కాళ్లు, చేతులు, తలపై కుక్కలు దారుణంగా కరవడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.  

దీంతో ఆమె మృతదేహాన్ని తన భర్త పోస్టుమార్టంకు తరలించారు. ఇక లోకల్ న్యూస్ పేపర్ కొరియర్ పికార్డ్ ప్రకారం, జింకల వేట కోసం వచ్చిన కుక్కలు మహిళపై దాడి చేసి చంపినట్లుగా భావిస్తున్నారు.