.Com డొమైన్‌ల ధరలు పెరుగుతున్నాయ్.. అంతా ట్రంప్ చలవే!

  • Published By: sreehari ,Published On : February 17, 2020 / 05:04 PM IST
.Com డొమైన్‌ల ధరలు పెరుగుతున్నాయ్.. అంతా ట్రంప్ చలవే!

Updated On : February 17, 2020 / 5:04 PM IST

మీ డొమైన్ ఎక్స్ టెన్షన్ ఏంటి? (.Com) లేదా డాట్ ఇన్ (.IN) .. ఏదిఏమైనా.. ప్రపంచ వ్యాప్తంగా .com డొమైన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. మీరు వాడే డొమైన్ ఎక్స్ టెన్షన్… డాట్ కామ్ (.com)అని ఉంటే దానికి వరల్డ్ వైడ్ వెబ్‌లో మీ డొమైన్ కు మంచి రెస్పాన్స్ ఉంటుంది. అందుకే చాలామంది తమ డొమైన్లను ఎక్కువగా .COMతో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా యూజర్లను ఎంగేజ్ అయ్యేందుకు డాట్ కామ్ ఫర్ ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు .COM డొమైన్ల ధరలు పెరగబోతున్నాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు చెబుతున్నాయి సంబంధిత కంపెనీలు. 

కొత్త ఒప్పందంలో భాగంగా వెరిసిన్ (verisign) అనే కంపెనీ .com డొమైన్లలో ధరలను పెంచుతోంది. దాంతో వినియోగదారులపై అధిక భారం పడనుంది. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ICANN) అనేది లాభాపేక్షలేని సంస్థ కూడా. ఇది ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టమ్‌పై అధికారం కలిగి ఉంది. రిజిస్ట్రీ, వెరిసిగ్న్, వెబ్‌లోని అన్ని .com డొమైన్‌లను నిర్వహిస్తుంది. వాటిని namecheap, GoDaddy వంటి రిజిస్ట్రార్‌లకు హోల్ సేల్ ధరకు విక్రయిస్తుంది. ఆయా డొమైన్లను వ్యక్తులు లేదా సంస్థలకు విక్రయిస్తుంది. ఇదంతా ట్రంప్ పరిపాలన తీసుకున్న విధాన నిర్ణయం నుంచే వచ్చిందని ఎన్ గాడ్జెట్ సంస్థ తెలిపింది. 

2018లో, అమెరికా వాణిజ్య విభాగంలో భాగమైన నేషనల్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (NTIA) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ‘ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధాన ప్రాధాన్యతలకు అనుగుణంగా.. మార్పులు చేయడానికి ‘ఒబామా-ఎరా ధర నియంత్రణలను’ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వెరిసిన్‌తో ఒప్పందంలో మధ్యవర్తిగా ఉన్న ICANN ధరల పెరుగుదలను అనుమతించే అధికారం ఉంది.

ICANN, NTIIA ధరలను నిర్ణయిస్తుందని పేర్కొంది, కానీ ఇది అబద్ధమని వెబ్ డెవలపర్లు, డొమైన్ నేమ్ హోల్డర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న లాభాపేక్షలేని వాణిజ్య సంస్థ ఇంటర్నెట్ కామర్స్ అసోసియేషన్ జనరల్ కౌన్సిల్ జాక్ ముస్కోవిచ్ అన్నారు. డొమైన్ సిస్టమ్ భద్రతను పెంచే దిశగా ఈ నిధులు వెళ్తాయని పేర్కొన్న నిబంధనలతో వచ్చే ఐదేళ్ళలో ICANN కు 20 మిలియన్లు చెల్లించడానికి వెరిసిన్ అంగీకరించింది.

ICANN ఒప్పందం కొత్త నిబంధనల ప్రకారం.. వెరిసిగ్న్ వచ్చే నాలుగేళ్ళకు ప్రతి సంవత్సరం .com ధరలను 7 శాతం పెంచవచ్చు. అప్పుడు రెండేళ్లపాటు ధరలను అలాగే స్థిరంగా ఉంచనుంది. 2026లో, వెరిసిన్ మరోసారి .com ధరలను మరో నాలుగు సంవత్సరాలు 7 శాతం పెంచే అవకాశం ఉంది. 2012 నుంచి.. గతంలోని ఒప్పందం వెరిసిగ్న్ వార్షిక .com ధరలో డొమైన్‌కు 7.85 డాలర్ల చొప్పున లాక్ చేయబడింది. కొత్త ఒప్పందం వచ్చే దశాబ్దంలో హోల్ సేల్ .com ధరను 13 డాలర్ల కన్నా ఎక్కువ పెంచే అవకాశం ఉంది.

రిజిస్ట్రీగా, వెరిసిన్ .com డొమైన్ పేర్లను నేరుగా యూజర్లకు విక్రయించదు. డొమైన్ రిజిస్ట్రార్లు, నేమ్‌చీప్, GoDaddy వంటివి చెల్లించే ధరలు మాత్రమే. అధిక డొమైన్ ధరలను కస్టమర్ల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసేలా ఈ రిజిస్ట్రార్లను ప్రోత్సహించే వీలుంది. ICANN, .com రిజిస్ట్రీ మధ్య కొత్త ఒప్పందంపై డొమైన్ రిజిస్ట్రార్లు ఇంటర్నెట్ ప్రొవైడర్లు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..