లండన్‌లో భారతీయులపై దాడి

లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనలు ఘర్షణకు దారితీశాయి. భారతీయులపై దాడి జరిగింది. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 03:35 AM IST
లండన్‌లో భారతీయులపై దాడి

Updated On : March 10, 2019 / 3:35 AM IST

లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనలు ఘర్షణకు దారితీశాయి. భారతీయులపై దాడి జరిగింది. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ

లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనలు ఘర్షణకు దారితీశాయి. ప్రవాస భారతీయులపై దాడి జరిగింది. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ నేపథ్యం ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారులు ప్రవాస భారతీయులపై దాడి చేశారు. సిక్కుల తలపాగా ధరించి నారా ఈ తక్బీర్ – అల్లా హు అక్బర్ అంటూ పాక్ అనుకూల నినాదాలు చేస్తూ..భారతీయులపై దాడికి పాల్పడ్డారు.

భారత్‌లో మైనారిటీ వర్గాలపై వివక్షను నిరసిస్తూ ఆందోళన చేస్తుండగా ఈ ఘటన జరిగింది. నిరసనలో భాగంగా.. ఓ వర్గం భారత్ కు, ప్రధాని మోడీకి మద్దతుగా నినాదాలు చేయడంతో ఆగ్రహానికి గురైన ఖలిస్తాన్‌ వర్గీయులు వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టినట్లు సమాచారం.

పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ‌ మద్దతుతో ఖలిస్తాన్‌ మద్దతుదారులు గతంలో అనేక సార్లు భారతీయులపై దాడులు చేశారు. ప్రస్తుతం జరిగిన దాడికి కూడా ఐఎస్‌ఐ‌ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. పుల్వామా దాడి తరవాత పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా బ్రిటన్‌లోని భారతీయులు అనేక సార్లు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆ సమయంలోనూ ఖలిస్తాన్‌ మద్దతుదారులు వారిపై దాడికి తెగబడ్డారు.

భారత హైకమిషన్ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళనలు ఘర్షణకు దారి తీశాయి. యూకే బేస్డ్ కశ్మీర్, ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ ఆందోళనలు చేపట్టారు. భారత్, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం వివాదానికి దారితీసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఓవర్సీస్ పాకిస్తాన్ వెల్ఫేర్ కౌన్సిల్ మద్దతుదారులు, ఇండియా సొసైటీ ఫ్రెండ్స్ మధ్య ఈ వివాదం జరిగింది.

భారత్, పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో లండన్ లోని ప్రవాస భారతీయులపై తరుచుగా దాడులు జరగడం కలకలం రేపింది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. దాడులపై పూర్తి సమాచారం ఇవ్వాలని లండన్ లోని భారత హైకమిషన్ సిబ్బంది కోరింది. ఈ ఘటన నేపథ్యంలో లండన్ లో ఉంటున్న భారతీయులకు భద్రత కల్పించాలని అక్కడి ప్రభుత్వాన్ని భారత విదేశాంగ శాఖ కోరింది. ప్రవాస భారతీయులపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని భారత విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది.