PUBG షట్ డౌన్ : కొత్త వీడియో గేమ్ టైటిల్ ఇదే

పబ్ జీ.. పబ్ జీ.. ఇక ఈ పేరు వినిపించదు. కనిపించదు. పబ్ జీ టైటిల్ కు బదులుగా మరో కొత్త వీడియో గేమ్ టైటిల్ వచ్చేసింది.

  • Publish Date - May 8, 2019 / 12:30 PM IST

పబ్ జీ.. పబ్ జీ.. ఇక ఈ పేరు వినిపించదు. కనిపించదు. పబ్ జీ టైటిల్ కు బదులుగా మరో కొత్త వీడియో గేమ్ టైటిల్ వచ్చేసింది.

పబ్ జీ.. పబ్ జీ.. చైనాలో ఇక ఈ పేరు వినిపించదు. కనిపించదు. పబ్ జీ టైటిల్ కు బదులుగా మరో New Video Game టైటిల్ వచ్చేసింది. పబ్ జీ టైటిల్ కు ప్రత్యామ్నాయంగా పెట్రియాటిక్ టైటిల్ ను చైనా సంస్థ టెన్సెంట్ రీప్లేస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బాటిల్ రాయల్ షూట్ గేమ్ పబ్ జీ కి ఎండ్ కార్డ్ పడింది. టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ బుధవారం (ఏప్రిల్ 8, 2019) చైనాలో టెస్ట్ వెర్షన్ గ్లోబల్ బ్లాక్ బస్టర్ ‘Player Unknown’s Battlegrounds ’ను షట్ డౌన్ చేసినట్టు ప్రకటించింది. ఇప్పటివరకూ పబ్ జీ పేరుతో వీడియో గేమ్ ఫ్యాన్స్ పెట్రియాటిక్ వెర్షన్ తో ఆడుకోవచ్చు.

పబ్ జీ టెస్టింగ్ వెర్షన్ ఎండ్ :
ఇటీవల చైనాలో వీడియో గేమ్స్ పై కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. దీంతో వీడియో గేమర్లపై ప్రభావం పడింది. చైనా ప్రభుత్వ రెగ్యులేటరీ రూల్స్ కు వ్యతిరేకంగా పబ్ జీ ఉండటంతో ఈ వీడియో గేమ్ కు సెక్యూరింగ్ లైసెన్స్ అప్రూవ్ చేయలేదు. దీంతో పబ్ జీ వీడియో గేమ్ సేల్ కాకపోవడంతో రెవెన్యూ జనరేట్ చేయలేకపోయింది. పబ్ జీ మొబైల్ వెర్షన్ నుంచి రెవెన్యూ పొందాలంటే.. లైసెన్స్ Approval తప్పనిసరి. దీంతో లైసెన్స్ అప్రూవల్ కోసం చైనీస్ కంపెనీ ఏడాది పాటు ఎదురుచూసింది. ఫలితం లేకపోవడంతో చివరికి పబ్ జీ టెస్టింగ్ గేమ్ వెర్షన్ నిలిపివేస్తున్నట్టు చైనా సోషల్ ప్లాట్ ఫాం Weibo పోస్టులో తెలిపింది. 

రెగ్యులెటరీ రూల్స్.. పెట్రియాటిక్ టైటిల్ :
PUBG టైటిల్ విధ్వంసకరంగా ఉండటంతో దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత నెలకొంది. రెగ్యులేటరీ రూల్స్ కు అనుగుణంగా టెన్సెంట్ సంస్థ లైసెన్స్ కోసం టెస్టింగ్ వెర్షన్ నిలిపివేసింది. పబ్ జీ స్థానంలో యాంటి టెర్రరిజం థీమ్ ‘Game for Peace’ పేరుతో పెట్రియాటిక్ టైటిల్ ను పెట్టేసింది. ఈ టైటిల్ మానిటైజేషన్ కు ఏప్రిల్ లోనే ఆమోదం లభించింది. ప్రస్తుతం చైనాలో పబ్ జీ మొబైల్ వీడియో గేమ్ కు సగటున 70 మిలియన్ల మంది డెయిలీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వార్షిక రెవెన్యూలో గేమ్ ఫర్ పీస్.. 8 బిలియన్ల యువాన్ల నుంచి 10 బిలియన్ల యువాన్ల వరకు (1.18 బిలియన్ డాలర్ల నుంచి 1.48 బిలియన్ల డాలర్లు) జనరేట్ అవుతుందని అంచనా వేస్తున్నట్టు చైనా టెక్ విశ్లేషకులు తెలిపారు.

టైటిలే కొత్తది.. వీడియో గేమ్ సేమ్ :
పబ్ జీ గేమ్ తరహాలో గేమ్ ఫర్ పీస్ వీడియో గేమ్ లో కూడా సేమ్ ఫీచర్లు ఉండనున్నాయి. గ్రాఫిక్ డిజైన్, క్యారెక్టర్లు, ప్లే బ్యాగ్ గ్రౌండ్ అన్ని ఒకేలా ఉంటాయి. యాంటీ టెర్రర్ థీమ్ కు అనుగుణంగా ఈ గేమ్ లో యూజర్లు షూట్ చేసినప్పుడు.. బ్లడ్ కనిపించదు. డెడ్ అయిన వాళ్లు.. లేచి గుడ్ బై చెప్పి మాయం అవుతారు. 2018లో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన టైటిల్లో ఒకటిగా పబ్ జీ నిలిచింది. ఈ గేమ్ ఫర్ పీస్ అప్ డేట్ త్వరలో రానుంది. పబ్ జీ టైటిల్ కు అలవాటుపడిన యూజర్లు ఈ కొత్త వీడియో గేమ్ టైటిల్ ఎంతమేరకు నచ్చుతుందో చూడాలి.