Queen Elizabeth Letter : సిడ్నీ ప్రజలకు క్వీన్ ఎలిజబెత్ రాసిన సీక్రెట్ లెటర్ .. 2085వ సంవత్సరంలో తెరవాలని నిబంధన

గ్రేట్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణంతో ఎన్నో కీలక విషయాలు బయటపడుతున్నాయి. వాటిలో ఒకటి సిడ్నీ ప్రజలను ఉద్దేశించి క్వీన్ ఎలిజబెత్ రాసిన లెటర్. బ్రిటన్ రాణి రాసిన ఓ లేఖ ఆస్ట్రేలియాలో ఇప్పటికీ భద్రంగా ఉంది. ఆ లెటర్ లో ఏమని రాశారు? అనే విషయం తెలుసుకోవాలంటే 2085సంవత్సరం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే 2085 సంవత్సరంలోనే ఆ లెటర్ ఓపెన్ చేసి చదవాలని నిబంధన విధించారామె.

Queen Elizabeth Letter : సిడ్నీ ప్రజలకు క్వీన్ ఎలిజబెత్ రాసిన సీక్రెట్ లెటర్ .. 2085వ సంవత్సరంలో తెరవాలని నిబంధన

Queen Elizabeth Letter secret

Updated On : September 13, 2022 / 11:05 AM IST

Queen Elizabeth Letter secret : గ్రేట్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణంతో ఎన్నో కీలక విషయాలు బయటపడుతున్నాయి. వాటిలో ఒకటి ఆమె రాసిన సీక్రెట్ లెటర్. సిడ్నీ ప్రజలను ఉద్దేశించి క్వీన్ ఎలిజబెత్ ఓ లెటర్ రాశారు. బ్రిటన్ రాణి రాసిన ఓ లేఖ ఆస్ట్రేలియాలో ఇప్పటికీ భద్రంగా ఉంది. ఆ లెటర్ లో ఏమని రాశారు? అనే విషయం తెలుసుకోవాలంటే దాన్ని వెంటనే తెరిచి చదవటానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే ఆ లెటర్ ను 2085సంవత్సరంలో ఓపెన్ చేసి చదవాలని నిబంధన ఉంది. రాయల్ ఫ్యామిలి అంటే అంతేమరి..ప్రతి విషయం ఆసక్తికరమే. ప్రతీ అంశం ఓ పద్ధతి ప్రకారం..నిబంధనల ప్రకారం జరగాల్సిందే. క్వీన్ ఎలిజబెత్ సిడ్నీ ప్రజలను ఉద్ధేశించి రాసిన ఆ లెటర్ లో ఏమని ఉంది? అనే విషయం ఆమె మరణం తరువాత అత్యంత ఆసక్తికరంగా మారింది. 1986 నవంబర్లో క్వీన్ ఎలిజబెత్ సిడ్నీ ప్రజలకు రాసిన లేఖపై ఉత్కంఠ నెలకొంది. 2085సంవత్సరం వరకు ఆ లెటర్ ను ఓపెన్ చేయకూడదని క్వీన్ ఎలిజబెత్ కోరిక. దీంతో దగ్రేట్ క్వీన్ ఎలిజబెత్ నిబంధన విధించటమూ..దాన్ని ఎవరైనా అతిక్రమించటమూనా?నెవ్వర్..అందుకే ఆ లెటర్ ఇప్పటికే ఆస్ట్రేలియాలో భద్రంగా ఉంది.

Queen Elizabeth : రాణి ఎలిజబెత్ మరణం అన్నదమ్ములిద్దరినీ ఒక్కటి చేస్తుందా? ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్స్ హ్యారీ తిరిగి కలిసిపోతారా?

క్వీన్ ఎలిజబెత్ విధించిన ఆ నిబంధనతో ఆ లేఖను ఇంతవరకు తెరవలేదు. 2085 వరకు ఆ లేఖను ఎవరూ తెరిచే వీల్లేదు. అది రాణి కోరిక. కోరిక అనేకంటే రూల్అనటం కరెక్ట్. ఆ లేఖను 1986లో సిడ్నీ ప్రజలను ఉద్దేశించి రాణి రాశారు. 2085లోనే ఈ లేఖను తెరవండి అంటూ నాడు సిడ్నీ నగర మేయర్ కు రాణి సూచన చేశారు. ఆ లేఖలోని సందేశాన్ని సిడ్నీ ప్రజలకు అందించండి అని ఆమె పేర్కొన్నారు.రాణి సంతకంతో కూడిన ఆ లేఖను సిడ్నీలోని క్వీన్ విక్టోరియా హాల్ లో భద్రపరిచారు. రాణి మరణంతో ఈ లేఖ సంగతి మరోసారి బయటికి వచ్చింది. అన్నేళ్ల పాటు తెరవొద్దని సూచించారు? క్వీన్ ఎలిజబెత్ ఆ లేఖలో ఏం రాశారన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ లేఖ యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ను పాలించిన రాణుల్లో రెండవరాణి క్వీన్ విక్టోరియా వజ్రోత్సవాన్ని జరుపుకోవడానికి 1898లో నిర్మించిన సిడ్నీలోని క్వీన్ విక్టోరియా భవనం పునరుద్ధణను జరుపుకోవటానికి వ్రాయబడింది. ఆ లెటర్ ఇప్పటికే క్వీన్ విక్టోరియా భవనంలోనే భద్రంగా ఉంది.

క్వీన్ విక్టోరియా ఐర్లాండ్‌కు 20 జూన్ 1837 నుండి 1901లో ఆమె మరణించే వరకు రాణి. విక్టోరియన్ శకం అని పిలువబడే ఆమె పాలన 63 సంవత్సరాల 7 నెలలు కొనసాగింది. ఈ కాలంలో గతంలో కంటే పారిశ్రామికంగా, రాజకీయంగా, శాస్త్రీయంగా.. బ్రిటిష్ సామ్రాజ్యం గొప్ప విస్తరణ చెందింది. 1876లో బ్రిటిష్ పార్లమెంట్ ఆమెకు భారత సామ్రాజ్ఞి అనే అదనపు బిరుదును మంజూరు చేసేందుకు ఓటు వేశారు.

King Charles : తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం .. కింగ్ చార్లెస్ పాలనపై సర్వత్రా ఆసక్తి..

బ్రిటన్‌ రాణులంటే విలాసవంతమైన జీవనశైలి, ప్రయాణాలు, అధికారం, హోదా.. ఒకప్పుడు సూర్యడు అస్తమించిన రాజ్యం బ్రిటన్… అలాంటి దేశాన్ని.. క్వీన్‌ ఎలిజబెత్‌-1, క్వీన్‌ విక్టోరియా, క్వీన్‌ ఎలిజబెత్‌-2 178 ఏళ్లు పాలించారు. వీరిలో ఎలిజబెత్‌-1, విక్టోరియా రాణుల కాలంలో ఎంతో హాయిగా గడచిపోయింది. కానీ.. ఎలిజబెత్‌-2కు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. రెండో ప్రపంచ యుద్ధంతో బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. ఆ సమయంలో ఎలిజబెత్‌-2కు పట్టాభిషేకం జరిగింది. బ్రిటన్‌ కాలనీలు ఒక్కొక్కటిగా స్వాతంత్రం ప్రకటించుకున్నాయి. దీంతో అప్పటివరకు ప్రపంచానికి కేంద్రబిందువుగా మారిన బ్రిటన్‌.. ఒంటరిగా మిగిలిపోయింది.

బ్రిటన్‌ రాణుల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. మొదటి రాణి.. క్వీన్‌ ఎలిజబెత్‌-1 ముందుంటారు. ఆమె పాలించిన 1558 నుంచి 1603 కాలాన్ని బ్రిటన్‌ స్వర్ణయుగంగా పిలుస్తారు. అప్పట్లో రాచరికం అనేది అనవాయితీగా ఉండేది. క్వీన్ ఎలిజబెత్‌-1 హయాంలోనే ఇంగ్లిస్‌ సాహిత్యం వర్దిల్లింది. విలియమ్‌ షేక్స్‌పియర్‌, క్రిష్టఫర్‌ మార్లోవ్‌ పేర్లు మార్మోగిపోయాయి. ఎలిజబెత్‌-1 కాలంలోనే సముద్రయాణం బ్రిటిషర్ల ఉధృతమైంది. బ్రిటన్‌ నేవల్‌ అధికారి ఫ్రాన్సిస్‌ డ్రాకే ఆధ‌్వర్యంలో నౌకాదళం సముద్రయానంపై మంచి పట్టు సాధించింది. మొదటి ఎలిజబెత్‌ రాణి 25 ఏళ్లలోనే బ్రిటన్‌ సింహాసనాన్ని అధిష్టించింది. ఆ బ్రిటన్‌ ప్రజలతో పాటు.. ఎలిజబెత్‌-1 పాలన కూడా హాయిగానే గడిచిపోయింది. 1558లో అధికారం చేపట్టిన ఆమె.. 1603లో చనిపోయేవరకు రాణిగా ఉన్నారు. క్విన్‌ ఎలిజబెత్‌-1 తరువాత విక్టోరియా మహారాణి పాలనను విక్టోరియన్‌ శకంగా పిలుస్తారు. 63 ఏళ్ల 7 నెలల పాటు బ్రిటన్‌ను ఆమె పాలించింది. ఆమె హయాంలోనే బ్రిటన్‌.. సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యంగా ఎదిగింది. అంటే.. బ్రిటన్‌ సూపర్‌ శక్తిగా ఎదిగింది. విక్టోరియా హయాంలోనే పారిశ్రామిక విప్లవం మొదలైంది. విక్టోరియా మహారాణితో పోలిస్తే.. ఎలిజబెత్‌-2 కాలం ఎలా ఉంది? ఎలిజబెత్‌-1, విక్టోరియా రాణులతో పోలిస్తే.. ఎలిజబెత్‌-2 హయాంలో బ్రిటన్‌ పరిస్థితి ఎలా మారిందో అనే విషయం తెలిసిందే.

Queen Elizabeth : ప్రిన్స్ ఫిలిప్‌ను పెళ్లిచేసుకున్న చర్చిలోనే క్వీన్ ఎలిజబెత్‌ ఆఖరి మజిలీ