లైవ్‌లో రిపోర్టర్ టంగ్ స్లిప్ : మృతుడితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం!

  • Published By: sreehari ,Published On : September 20, 2019 / 09:58 AM IST
లైవ్‌లో రిపోర్టర్ టంగ్ స్లిప్ : మృతుడితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం!

Updated On : September 20, 2019 / 9:58 AM IST

ప్రతిఒక్కరూ ఏదో ఒక సమయంలో టంగ్ స్లిప్ అవుతుంటారు. తర్వాత అయ్యే అలా అనేసానేంటీ అని తెగ ఫీల్ అవుతుంటారు. అది అఫీసు వర్క్ లో కావొచ్చు లేదా ఎక్కడైనా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు. టీవీ ఛానళ్లలో కూడా చాలామందికి లైవ్ టెలిక్యాస్ట్ చేసే సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. కొన్నిసార్లు వర్క్ టెన్షన్ లో ఏదో మాట్లాడుతున్నామో కూడా గ్రహించలేరు.

వారి పరిస్థితిని చూసిన వాళ్లంతా నవ్వడం తప్ప చేసేదేమి ఉండదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే యూఎస్ జర్మలిస్ట్ సారా వెల్చ్ అనే యువతికి ఎదురైంది. ఏడాది క్రితం.. సారా వెల్చ్.. ఓ న్యూస్ ఛానల్ తరపున లాంచ్ ఏంజెల్స్ నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తోంది. దక్షిణ కాలిఫోర్నియాలో ఓ రోడ్డుప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో మృతదేహం పడి ఉంది. 

స్పాట్ నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్న యువతి వెల్చ్.. పొరపాటున టంగ్ స్లిప్ అయింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల కోసం డెడ్ బాడీని అడిగి తెలుసుకుందామని ఒక్కసారిగా అనేసింది. లైవ్ రిపోర్ట్ లో.. మనం ఇప్పుడు ప్రమాద ఘటన దగ్గరకు చేరుకున్నాం. కేసుకు సంబంధించి మృతుడు ఏమంటాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం’ అని నోరు జారింది. 

ఆ తర్వాత టీవీ ఛానళ్లలో ప్రసారమైన ఫుటేజీ చూసి నాలుక కరుచుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కడుపుబ్బేలా నవ్వుకుంటున్నారు. ఈ ట్వీట్ ను 24.6 రీట్వీట్లు చేయగా.. 98.3 లైకులు వచ్చాయి. సారా చెప్పిన మాటలు విన్న నెటిజన్లు ట్విట్టర్ వేదికగా జోకులు పేలుస్తున్నారు. ట్రోల్ అవుతున్న తన వీడియోపై వెల్చ్ స్పందిస్తూ.. ఈ వీడియో ఏడాది కిందటది అని నవ్వుతూ.. చెప్పింది. వైరల్ అవుతున్న వీడియో ఇదే..