Rishi Sunak’s New Pledge: సెప్టెంబరు 5నే బ్రిటన్ ప్రధాని ఎన్నిక ఫలితాలు.. మరో కొత్త హామీ ఇచ్చిన భారత సంతతి నేత రిషి సునక్
రిషిక్ సునక్ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ... దేశాన్ని ప్రపంచంలోనే ఉత్తమ దేశంలో చేయడానికి తాను రాత్రింబవళ్ళు పనిచేస్తానని చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా నియంత్రిస్తానని, జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్) యూకే ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతోందని అన్నారు. ఆ పరిస్థితులు లేకుండా చేస్తే బ్రిటన్ భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. తమ కన్జర్వేటివ్ పార్టీ మూలాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా తన వద్ద సరైన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఎన్నికకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

Rishi Sunak's New Pledge
Rishi Sunak’s New Pledge: బ్రిటన్ ప్రధాని పదవికి ఎన్నికైతే యూకేను ప్రపంచంలోనే ఉత్తమ దేశంగా తీర్చిదిద్దుతానని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునక్ అన్నారు. బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ పదవికి రిషి సునక్ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. తుది రేసులో లిజ్ ట్రస్ తో ఆయన పోటీ పడుతున్నారు. ఇరువురు నేతలు పలు హామీలు ఇస్తూ, తమ ప్రణాళికలు చెబుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు.
తాజాగా, రిషిక్ సునక్ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ… దేశాన్ని ప్రపంచంలోనే ఉత్తమ దేశంలో చేయడానికి తాను రాత్రింబవళ్ళు పనిచేస్తానని చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా నియంత్రిస్తానని, జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్) యూకే ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతోందని అన్నారు. ఆ పరిస్థితులు లేకుండా చేస్తే బ్రిటన్ భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. తమ కన్జర్వేటివ్ పార్టీ మూలాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా తన వద్ద సరైన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.
కాగా, ఎన్నికకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. సెప్టెంబర్ 5న కన్జర్వేటివ్ పార్టీ కొత్త అధినేత, బ్రిటన్ ప్రధాని పేరును ప్రకటించనున్నారు. రిషి సునాక్ గెలిస్తే బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర లిఖిస్తారు. ఈ సారి పోటీ తీవ్రంగా ఉందని కన్జర్వేటివ్ పార్టీ ఛైర్మన్ ఆండ్రూ స్టీఫెన్ సన్ అన్నారు.
Kapil Dev on Virat Kohli: విరాట్ కొహ్లీ మళ్ళీ ఫాంలోకి రావడానికి ఎంతో కాలం పట్టదు: కపిల్ దేవ్