లైవ్ ఓడ్కా ఛాలెంజ్..తాగేస్తే భారీ రివార్డ్..తర్వాతేమైందంటే..

లైవ్ ఓడ్కా ఛాలెంజ్..తాగేస్తే భారీ రివార్డ్..తర్వాతేమైందంటే..

Updated On : February 6, 2021 / 4:25 PM IST

Live Vodka challenge Russia man dies : ఆన్ లైన్ ఛాలెంజ్ లకు ఆశపడితే ఏం జరుగుతుందో తెలిపే ఘటన ఒకటి జరిగింది. ‘‘లైవ్ ఓడ్కా ఛాలెంజ్..తాగేస్తే భారీ రివార్డ్ మీదే.. దీనికి అన్ని వయస్సుల వారూ అర్హులే’’ అంటూ ఓ యూట్యూబర్ ఆన్ లైన్ లో ఛాలెంజ్ విసిరాడు. దీనికి ఎంతోమంది టెమ్ట్ అయ్యారు. కానీ అంత ఈజీ కాదనుకుని వదిలేశారు. కానీ ఏ 60ఏళ్ల వృద్ధుడు ట్రై చేశాడు.ఫలితంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన రష్యాలో జరిగింది.

రష్యాకు చెందిన 60 ఏళ్ల యూరి దుషెచ్కిన్‌ అనే వ్యక్తి ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి వోడ్కాను తాగడం ప్రారంభించాడు. అయితే 1.5లీటర్ల వోడ్కా తాగిన తర్వాత ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. యూట్యూబ్‌ లైవ్‌లో అందరూ చూస్తుండగానే ఇతను కన్నుమూశాడు. దీంతో ఈ సరదా ఛాలెంజ్‌ విషాదంగా ముగిసింది.

‘లైవ్‌లో హాట్‌ సాస్‌ లేదా, 1.5లీటర్ల వోడ్కా తాగితే.. భారీగా నగదు ఇస్తామని..దీనికి ఏజ్ లిమిట్ లేదు అంటూ ఓ యూట్యూబర్‌ సవాల్‌ విసిరాడు. ఈ పోటీలో పాల్గొనటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఎవ్వరికీ సాధ్యం కాలేదు. రష్యాకు చెందిన 60 ఏళ్ల యూరి దుషెచ్కిన్‌ అనే వ్యక్తి ఈ పోటీలో పాల్గొన్నాడు.

లైవ్‌ స్ట్రీమింగ్‌లో అప్పటిదాకా ఎంతో హుషారుగా కనిపించిన యూరీ దుషెచ్కిన్ వోడ్కా తాగుతూ తాగుతూనే ప్రాణాలు విడిచాడు. దీంతో లైవ్ లో చూస్తున్నవారు షాక్‌ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇటువంటి ఛాలెంజ్ లపై నిషేధం విధించాలని రష్యన్‌ సెనేటర్‌ అలెక్సీ పుష్కోవ్ సైతం డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో కొత్త కొత్తగా పుట్టుకొచ్చే ఛాలెంజ్‌లు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. సరదా సంగతి పక్కనపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కాబట్టి సత్తాకు మించిన సవాళ్లు తీసుకోకపోవటమే మంచిది అని ప్రతీ ఒక్కరూ గుర్తించిల్సిన అవసరం చాలా ఉంది..