Russia Victory Day : విక్టరీ డే సెలబ్రేషన్స్ లో పుతిన్ ఏం ప్రకటించనున్నారు? ఉత్కంఠగా దృష్టి సారించిన ప్రపంచ దేశాలు

రెండో ప్రపంచయుద్ధంలో నాజీ సైన్యం రష్యాకు లొంగిబోతున్నట్టు ప్రకటించిన మరుసటిరోజును మాస్కో ఏటా విక్టరీ డేగా జరుపుకుంటుంది. ఈ విక్టరీ డే సెలబ్రేషన్స్ లో పుతిన్ ఏం ప్రకటించనున్నారు? అనే విషయంపప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.

Russia celebrates victory day over 194 world war ii win : యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిందా..గెలిచిందా…? నాటోలో చేరే ప్రయత్నాలను యుక్రెయిన్, చేర్చుకునే ప్రయత్నాలను పాశ్చాత్య దేశాలు నిలిపివేయడాన్నిరష్యా విజయమనుకోవాలా లేక రెండు రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్దం రెండున్నర నెలలు దాటడాన్ని రష్యా పరాజయమనుకోవాలా..? విక్టరీ డే వేళ కలుగుతున్న సందేహాలివి.

రెండో ప్రపంచయుద్ధంలో నాజీ సైన్యం రష్యాకు లొంగిబోతున్నట్టు ప్రకటించిన మరుసటిరోజును మాస్కో ఏటా విక్టరీ డేగా జరుపుకుంటుంది. విక్టరీ డేకు రష్యాలో ఎంతో ప్రాధాన్యముంది. ఈ వేడుకలు రష్యా శక్తిని ప్రపంచానికి చాటుతాయి. రెడ్‌స్క్వేర్‌లో రష్యా సైన్యం మార్చ్‌, ఫైటర్ జెట్లు, బాంబర్లు, ఇతర యుద్ధ విమనాలతో ప్రదర్శన జరుపుతుంది. రెండున్నరనెలలుగా యుక్రెయిన్ యుద్ధం సాగుతున్న తరుణంలో రష్యా విక్టరీ డేపై ప్రపంచం దృష్టి మొత్తం నెలకొంది. ప్రపంచం మొత్తం పుతిన్ వైపే చూస్తోంది.

Also read : Himachal Khalistan: హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ఖలిస్థాన్ జెండాల ఘటనలో కేసులు నమోదు

అటు యుద్ధం వార్తలను మొదటి నుంచీ తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్న పాశ్చాత్యమీడియా…రష్యా అనుకున్నలక్ష్యాలను సాధించలేదని ఆరోపిస్తూనే ఉంది. యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ప్రణాళికలన్నీ విఫలమయ్యాయన్నది పాశ్చాత్య మీడియా విమర్శిస్తోంది. పుతిన్ ప్లాన్ -A, ప్లాన్ -B విఫలమయ్యాయని, ప్లాన్ -C అమలుచేస్తున్నారని అమెరికా, యూరప్ ఆరోపిస్తున్నాయి.

రెండు రోజుల్లో కీవ్‌ను ఆక్రమించుకుని యుక్రెయిన్ ప్రభుత్వాన్ని పడదోయాలన్నది పుతిన్ ప్లాన్-A. అది విఫలమవడంతో చెర్నిహివ్, ఖేర్సన్, సుమి, ఖర్కైవ్, డొన్టెస్క్, మరియుపోల్ వంటి నగరాలను ఆక్రమించి..కీవ్‌ను చుట్టుముట్టాలని పుతిన్ ప్లాన్ -B. కానీ అది కూడా విఫలమయింది. ఖేర్సన్ తప్ప ఏ నగరమూ రష్యా ఆధీనంలో లేదని అమెరికా, యూరప్ అంటున్నాయి.ప్లాన్-A, ప్లాన్ -B విఫలమవ్వడంతో రష్యా ప్లాన్ -C అమలుచేస్తోంది. కీవ్‌తో పాటు యుక్రెయిన్ ఉత్తర ప్రాంతంలో దాడులు నిలిపివేసి డాన్‌బాస్ ప్రాంతంపైనా, దక్షిణ యుక్రెయిన్‌ పైనా దాడులు జరుపుతోంది. తూర్పు యుక్రెయిన్ నగరాల్లో బీభత్సం సృష్టిస్తోంది. నిరంతరాయంగా యుద్ధవిమానాలు, షెల్లింగ్‌లతో విరుచుకుపడుతోంది.

యుద్ధం ముగింపులేకుండా సాగుతున్నప్పటికీ..పుతిన్ మాత్రం తాము ఓడిపోయామన్న భావనలో లేరని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ CIA అంటోంది. తన బలగాలు యుక్రెయిన్‌ను ఓడించగలవన్న స్థిరమైన అభిప్రాయంతోనే పుతిన్ మొదటి నుంచీ ఉన్నారని, రెండున్నర నెలల యుద్ధం తర్వాత కూడా ఆయన తన అభిప్రాయం మార్చుకోలేదని తెలిపింది. అలాగే యుద్ధంలో పుతిన్ అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం లేదని కూడా CIA అంటోంది.

Also read : Himachal Khalistan: హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ఖలిస్థాన్ జెండాల ఘటనలో కేసులు నమోదు

రష్యా బలగాలను ప్రతిఘటిస్తున్న యుక్రెయిన్….మాస్కోకు చెంది మరో యుద్ధనౌకను కూల్చివేసినట్టు ప్రకటించింది. బేరాక్తర్ టీబీ2 డ్రోన్ ఉపయోగించి నల్లసముద్రంలో రష్యా యుద్దనౌకను కూల్చివేశామని కీవ్ ప్రకటించింది. సేర్న ప్రాజెక్టుకు చెందిన రష్యా విమానాన్ని డ్రోన్ కూలుస్తున్న దృశ్యాల వీడియోను విడుదల చేసింది.

యుక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల నుంచి ఆయుధ, ఆర్థిక సాయం కొనసాగుతోంది. ముఖ్యంగా బ్రిటన్ యుక్రెయిన్‌కు అన్నివిధాలుగా అండగా ఉంటోంది. తాజాగా బ్రిటన్ 12వేల22కోట్ల మిలటరీ సాయం ప్రకటించింది. అటు యుద్ధంలో మరణాలపై అటు రష్యా, ఇటు యుక్రెయిన్ ఎవరికి తోచిన ప్రకటన అవి చేస్తున్నాయి. రష్యాకు చెందిన 24వేలమంది సైనికులు చనిపోయారని, వెయ్యి యుద్ధ ట్యాంకులు, 2వేల600 ఆర్మీ వాహనాలు, వంద యుద్ధవిమానాలు కోల్పోయిందని తెలిపింది. యుక్రెయిన్ నగరాల్లో జరిగిన విధ్వంసం…ఆ దేశానికి జరిగిన నష్టాన్ని కళ్లకుకడుతోంది. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 2వేల345 మంది సాధారణ పౌరులు యుద్ధంలో కన్నుమూశారు. మరి యుక్రెయిన్ సైన్యానికి కలిగిన నష్టం గురించి అధికారిక లెక్కలు తెలియడం లేదు. గెలుపోటముల సంగతి పక్కనపెడితే యుద్ధం యుక్రెయిన్‌ను సర్వనాశనం చేసింది. కోటీ 20లక్షల మంది ప్రజలను శరణార్థులుగా మార్చివేసింది.

ట్రెండింగ్ వార్తలు