Himachal Khalistan: హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ఖలిస్థాన్ జెండాల ఘటనలో కేసులు నమోదు

హిమాచల్ ప్రదేశ్ లో అశాంతియుత ఘటనలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్త అలెర్ట్ ప్రకటించింది ప్రభుత్వం

Himachal Khalistan: హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ఖలిస్థాన్ జెండాల ఘటనలో కేసులు నమోదు

Hp

Himachal Khalistan: హిమాచల్ ప్రదేశ్ లో అశాంతియుత ఘటనలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్త అలెర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ధర్మశాలలోని హిమాచల్ అసెంబ్లీ భవన ప్రహరీ గోడపై ఆదివారం ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన జెండాలు దర్శనమిచ్చాయి. ఖలిస్థాన్ వేర్పాటువాదులు కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడివుంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, అసెంబ్లీ భవనంపై ఒక ఉగ్రవాద సంస్థ జెండాలు వెలియడంపై హిమాచల్ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు నెలకొన్నాయి. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అప్రమత్తం అయిన పోలీసు యంత్రాంగం..ఆమేరకు రాష్ట్రంలో భద్రత కట్టు దిట్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల్లో భద్రతను పెంచిన పోలీసులు, అన్ని వాహనాలను పరిశీలించడంతో పాటు అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Also read:Dawood Ibrahim: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులపై ఎన్ఐఏ దాడులు

మరోవైపు ధర్మశాలలోని అసెంబ్లీ భవన ప్రహరీ గోడపై ఖలిస్థాన్ జెండాలు దర్సనమిచ్చిన ఘటనలో అమెరికాకు చెందిన “సిఖ్ ఫర్ జస్టిస్(SJF)” సంస్థ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పై ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ కింద హిమాచల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ధర్మశాల పరిధిలోని కనేడ్ గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురుపత్వంత్ సింగ్ పన్నూన్, మరికొందరు వేర్పాటువాదులపై కేసులు నమోదు చేసినట్లు హిమాచల్ ప్రదేశ్ డీజీపీ సంజయ్ కుందూ వెల్లడించారు. ఇక ఈ ఘటనలో త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీపీ సంజయ్ కుందూ పేర్కొన్నారు. ఖలిస్థాన్ ఏర్పాటుపై హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు జూన్ 6న ఓటింగ్ నిర్వహించనున్నట్లు “సిఖ్ ఫర్ జస్టిస్(SJF)” ప్రకటించింది. ఈక్రమంలోనే రాష్ట్రంలో అశాంతియుత వాతావరణం నెలకొన్నట్లు పోలీసులు గుర్తించారు.

Also read:Infibeam R Srikanth: ఇన్ఫిబీమ్ ఫైనాన్స్ కంపెనీ కార్యనిర్వాహకాధికారి ఆర్.శ్రీకాంత్ దంపతుల దారుణ హత్య