Russia Covid Deaths : రష్యాని వణికిస్తున్న డెల్టా వేరియంట్..రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు

ప్రపంచంలో మొట్టమొదటిగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన రష్యాలో వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.

Russia Covid Deaths : రష్యాని వణికిస్తున్న డెల్టా వేరియంట్..రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు

Russia

Updated On : June 29, 2021 / 7:32 PM IST

Russia Covid Deaths ప్రపంచంలో మొట్టమొదటిగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన రష్యాలో.. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రష్యాలో గడిచిన 24 గంటల్లో 20,616 కోవిడ్ కేసులు, 652 కోవిడ్ మరణాలు సంభవించినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో నమోదైన అత్యధిక కోవిడ్ మరణాలు ఇవేనని తెలిపింది. కాగా, గత శుక్రవారం యూరో 2020(ఫుట్ బాల్ టోర్నమెంట్)క్వార్టర్ ఫైనల్ కి ఆతిథ్యమిచ్చిన సెయింట్ పీటర్స్ బర్గ్ లోనే అత్యధికంగా 119 కోవిడ్ మరణాలు నమోదైనట్లు తెలిపింది.

గడిచిన కొన్ని వారాలుగా రాజధాని మాస్కో,సెయింట్ పీటర్స్ బర్గ్ సిటీల్లో అయితే కేసుల సంఖ్య,మరణాల సంఖ్య భారీగానే పెరిగింది. రాజధానిలో నమోదవుతున్న 90శాతం కేసులకు డెల్టా వేరియంటే కారణమని మాస్కో మేయర్ సెర్గియి సోబ్యానిన్ తెలిపారు. కోవిడ్ కట్టడి కోసం మళ్లీ మాస్కోలో ఆంక్షలను విధించినట్లు ఆయన తెలిపారు.

కాగా,రష్యా అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు ఆ దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 5,493,557గా ఉండగా,కోవిడ్ మరణాల సంఖ్య 134,545గా ఉంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,984,037గా ఉంది.