Russia-Ukraine War : శాంతి చర్చలకు సై అన్న రెండు దేశాలు.. అణ్వాయుధాలపై రష్యా కీలక ప్రకటన..!
యుక్రెయిన్‌పై దండెత్తి వచ్చిన రష్యాతో భీకర యుద్ధం నడుస్తోంది. రెండు రోజుల వరకు మౌనంగా ఉండిపోయిన యుక్రెయిన్ సేనలు ఊహించని రీతిలో రష్యా దళాలను ప్రతిఘటిస్తున్నాయి.

Russia Ukraine War Two Countries Agree On Peace Talks, But Russia’s Key Statement On Nuclear Weapons
Russia-Ukraine War : యుక్రెయిన్‌పై దండెత్తిన రష్యాతో భీకర యుద్ధం నడుస్తోంది. రెండు రోజుల వరకు మౌనంగా ఉండిపోయిన యుక్రెయిన్ సేనలు ఊహించని రీతిలో రష్యా దళాలను ప్రతిఘటిస్తున్నాయి. రోజురోజుకీ యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా మారుతోంది. ఎవరూ ఊహించని విధంగా యుద్ధంలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చలకు రెడీ అంటూనే మరోవైపు అణు హెచ్చరికలు చేస్తున్నారు. అణుబాంబును ప్రయోగిస్తే.. ఎంతటి మారణహోమం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గతంలోనూ అణుబాంబు వల్ల వినాశనానికి దారితీసింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి వస్తుందేమోనన్న భయం ప్రపంచ దేశాలకు పట్టుకుంది. రష్యా అణు హెచ్చరికలతో ప్రపంచదేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుక్రెయిన్, రష్యా మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేపట్టాయి. అందులో భాగంగానే శాంతి చర్చలకు కోసం రెండు దేశాలు అంగీకరించాయి.
మరోవైపు.. అణ్వాయుధ ప్రయోగానికి సంసిద్ధంగా ఉండాలంటూ రష్యా సేనలకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఆదేశాలను జారీ చేయడం మరింత ఆందోళన రేకిత్తిస్తోంది. రష్యాతో యుద్ధంలో పోరాడేందుకు యుక్రెయిన్‌కు కొన్ని దేశాలు ఆయుధాలను అందించేందుకు ముందుకు వచ్చాయి. యుక్రెయిన్ దండయాత్రను వ్యతిరికేస్తూ అనేక ప్రపంచ సభ్య దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలను విధించాయి. ఈ నేపథ్యంలో మరింత రెచ్చిపోయిన పుతిన్ సంచలన నిర్ణయానికి తెరలేపారు. గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్ అయిన (SWIFT)కు సంబంధించి రష్యాను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.
అమెరికా, ఇతర ఐరోపా దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో పుతిన్‌ను మరింత ఆగ్రహానికి గురిచేసింది. రష్యాలోకి విమానాల రాకపోకలపై కూడా నిషేధం విధించాయి. ఈయూ దేశాలు పుతిన్ మరింత ఆగ్రహాన్ని కలిగించడంపై ‘SWIFT’ నుంచి రష్యాను బహిష్కరిస్తూ ఇప్పటికే అమెరికా, ఇతర దేశాలు నిర్ణయం తీసుకోవడం, రష్యాలోకి విమానాల రాకపోకల్ని ఈయూ దేశాలు నిషేధించడం పుతిన్‌కు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. రష్యా చర్యలను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా పుతిన్ కు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియకు భారత్ దూరంగా ఉంది.

Russia Ukraine War Two Countries Agree On Peace Talks, But Russia’s Key Statement On Nuclear Weapons
ఈ క్రమంలోనే భారత్ ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఎప్పటికప్పుడూ దృష్టి సారిస్తూ వస్తోంది. యుక్రెయిన్‌లో యుద్ధవాతావరణంలో ఇప్పటివరకూ ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చల పేరుతో బెలారస్ కు రావాలని రష్యా యుక్రెయిన్‌కు ఆహ్వానం పలికింది. అందుకోసం.. ఆ దేశంలోని గోమెల్ నగరానికి ప్రతినిధి బృందాన్ని కూడా పంపింది. యుక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం.. బెలారస్ తమకు ఆమోదయోగ్యమైన ప్రాంతం కాదని తేల్చిచెప్పారు. చర్చల విషయంలో యక్రెయిన్ అక్కడికి వచ్చే ప్రసక్తే లేదని జెలెన్ స్కీ స్పష్టం చేశారు కూడా.
ఒకవైపు తమ దేశంపై దాడులకు దిగుతూనే మరోవైపు బెలారస్ చూపిస్తూ అక్కడనే శాంతి చర్చలకు రావాలని పుతిన్ పిలుపు వెనుక మర్మం ఏంటో తమకు తెలుసునని యుక్రెయిన్ అధ్యక్షుడు తప్పుపట్టారు. తమకు ఇస్తాంబుల్, వార్సా, బ్రటిస్లావా, బాకు, బుడాపెస్ట్ లాంటి నగరాల్లో చర్చలు జరపడానికి తాము సిద్ధమని జెలెన్ స్కీ కూడా ప్రకటించారు. ఆఖరికి బెలారస్నే వేదికగానే చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. చర్చలతో సమస్య ముగిసి పోతుందిలే అనుకుంటే.. యుక్రెయిన్ యుద్ధంలో అణ్వాయుధాలను ప్రయోగించడానికి రష్యా సన్నద్ధమవుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ క్షణంలోనైనా అణ్వాయుధాలతో రంగంలో దిగేందుకు సిద్ధంగా ఉండాలని తమ బలగాలకు పుతిన్ ఆదేశాలిచ్చారు. ఖర్కివ్ గ్యాస్ పైప్ లైన్ రష్యా బలగాలు పేల్చేయడం వల్ల పర్యావరణంపై పెను ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.