Russia-Ukraine :మిస్సైళ్లు దూసుకొచ్చినా ‘తగ్గేదేలే’..రష్యా యుద్ధ ట్యాంకులను అడ్డుకోవటానికి యత్నించిన ‘రియల్ హీరో’
ఎన్ని బాంబులు వేసినా.. ఎన్ని మిస్సైళ్లు దూసుకువచ్చినా తగ్గేదే లేదంటున్నారు యుక్రెయిన్ ప్రజలు. రష్యా యుద్ధ ట్యాంకులను నిలువరించటానికి యత్నించాడో వ్యక్తి.

Russias Military Action
Russia-Ukraine War : మూడవ రోజు కూడా రష్యా సేనలు యుక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే చాలా నగరాలను స్వాధీనంచేసుకున్న రష్యా..ఇక అధికారాన్ని కూడా చేజిక్కించుకోవాలని చూస్తోంది. దీంట్లో భాగంగా యుక్రెయిన్ రాజధాని కీవ్ లో రష్యా యుద్ధ ట్యాంకులు పదుల సంఖ్యలోదూసుకొచ్చాయి. అలా దూసుకొస్తున్న యుద్ధ ట్యాంకులకు అడ్డంగా వెళ్లి వాటిని అడ్డుకోవటానికి యత్నించాడు యుక్రెయిన్ వ్యక్తి. కాళీ చేతులు..రష్యా భారీ బలగాలను ఏమీ చేయలేమని తెలిసి..ఏ క్షణమైనా వారు చంపేస్తారని తెలిసినా..ప్రాణాలు లెక్క చేయకుండా అత్యంత వేగంగా దూసుకొస్తున్న రష్యా యుద్ధ ట్యాంకులకు ఎదురెళ్లి వాటిపై పిడి గుద్దులు కురిపించాడు. భారీ పర్వతంపై పిడి గుద్దులు కురిపిస్తే ఏమవుతుంది?ఏమీ అవ్వదు..చిన్న గులక రాయి కూడా కదలదు.కానీ యుక్రెయిన్ దేశభక్తుడైన ఓ వ్యక్తి మాత్రం రష్యా యుద్ధ ట్యాంకులను తానేమీ ఒంటరిగా ఏమీ చేయలేనని తెలిసినా ఆగలేదు. వాటికి ఎదురెళ్లి మరీ వాటిని ఆపటానికి అడ్డం పడ్డాడు.కానీ రష్యా యుద్ధ ట్యాంకులు మాత్రం కీవ్స్ వైపు వేగంగా దూసుకొచ్చాయి. కానీ వాటికి ఎదురెళ్లిన ఆ వ్యక్తి మాత్రం ‘రియల్ హీరో’..అనిపించాడు.
ఎన్ని బాంబులు వేసినా.. ఎన్ని మిస్సైళ్లు దూసుకువచ్చినా తగ్గేదే లేదంటున్నారు యుక్రెయిన్ ప్రజలు. ఓ వైపు రష్యా యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఎవరు అడ్డొచ్చినా తూటాల వర్షం కురిపిస్తున్నారు రష్యా బలగాలు. దీంతో తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఏకంగా పౌరులే రంగంలోకి దిగారు. రష్యాతో యుద్ధంలో మేము సైతం అంటున్నారు యుక్రెయిన్ దేశస్తులు. ఏకంగా రష్యన్ బలగాల ట్యాంకులకు ఎదురొడ్డి నిలుస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇదే పనిచేశాడు. పదుల సంఖ్యలో వస్తున్న రష్యా యుద్ధ వాహనాలను చూసి ఏమాత్రం అదరలేదు.. బెదరలేదు.
పైగా స్పీడ్‌గా వస్తున్న ఆ వాహనాలకు ఎదురెళ్లాడు. యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై దాడి చేసేందుకు రష్యన్ బలగాలు పదుల సంఖ్యలో రోడ్డుపై వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓ యుక్రెయిన్ దేశస్తుడు ట్యాంకులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అది కూడా ఒంటరిగానే. ఆ వాహనాలపై పిడిగుద్దులు గుద్దాడు. అతడి ధైర్యానికి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలైన మగధీరుడు నువ్వే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు దేశం కోసం పోరాడేందుకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలన్న జెలెన్‌స్కీ పిలుపు మేరకు యుక్రెయిన్ ప్రజలు కదనరంగంలోకి దిగుతున్నారు. వీధుల్లో దొరికిన తుపాకీని పట్టుకొని రష్యన్ ఆర్మీ పైకి దండెత్తుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో సైనికుడిలా మారుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ.. అందరిలోనూ దేశ భక్తి భావోద్వేగమే కనిపిస్తోంది. అందుకే ఆయుధాలు పట్టి తమ దేశం వైపు దూసుకొస్తున్న రష్యన్ ఆర్మీపైకి దూకుతున్నారు.