పుతిన్‌కు రష్యా బర్త్‌డే గిఫ్ట్: ఈ అణ్వాయుధ మిస్సైల్‌ను ప్రయోగిస్తే అమెరికా కూడా అడ్డుకోలేదు

Russian Zircon missile : శక్తివంతమైన అణు క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 68వ పుట్టినరోజు గిఫ్ట్‌గా.. రష్యా మిలటరీ హైపర్ సోనిక్ న్యూక్లియర్ మిస్సైల్‌ను ప్రయోగించింది. 6,000mph (9,600kph) కంటే ఎక్కువ వేగంతో గాలిలో ప్రయాణించగలదు.
రష్యా ఉత్తరాన ఉన్న తెల్లని సముద్రంలో నేవీ షిప్ నుంచి ఈ మిస్సైల్ పరీక్షించింది. Admiral Groshkov frigate నుంచి ఈ లాంచింగ్ ప్రక్రియ కొనసాగిందని రష్యాన్ జనరల్ స్టాఫ్ చీఫ్ Valery Gerasimov వెల్లడించారు.
Zircon అనే మిస్సల్ హైపర్ సోనిక్ న్యూక్లియర్ వెపన్.. కనురెప్పపాటులో ఆకాశంలోకి అత్యంత వేగంగా దూసుకెళ్లగల సామర్థం దీనిలో ఉంది. ఈ Zircon మిస్సైల్.. ధ్వని వేగానికి కంటే స్పీడ్ గా ప్రయాణించగలదు.. అమెరికా, యూకే లాంటి యాంటీ మిస్సల్ సిస్టమ్స్ కంటే త్వరగా లక్ష్యాన్ని చేరుకోగలదు.
Barents Seaలోని 280 మైళ్లు (450కిలోమీటర్లు) దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని Gerasimov వెల్లడించారు. గురిపెట్టిన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ మిస్సల్ టార్గెట్ రీచ్ అయ్యేందుకు 270 సెకన్ల సమయం తీసుకుంది.
మిస్సల్ టెస్టింగ్ సక్సెస్ కావడంతో దేశాధ్యక్షుడు పుతిన్ రష్యా మిలటరీని అభినందించారు. విజయవంతమైన ఈ మిస్సైల్ టెస్టింగ్ రష్యాకు పెద్ద పండుగ అని పుతిన్ ప్రశంసించారు.
సాయుధ దళాలను సైన్యం, నావికాదళాన్ని అసమానమైన ఆయుధ వ్యవస్థలతో సన్నద్ధం చేయడం వల్ల దీర్ఘకాలికంగా దేశీయ రక్షణ సామర్థ్యాన్ని ఖచ్చితంగా బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నానని అధ్యక్షుడు చెప్పారు.
అణు యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ నగరాలను తుడిచిపెట్టగల సామర్థం ఉన్న ఆయుధంగా Zircon – Tsirkon మాస్కో ప్రభుత్వ నియంత్రత టెలివిజన్ పేర్కొంది. అమెరికాను సైతం అడ్డుకోగల సామర్థ్యం ఉన్న ఈ అణు మిస్సైల్‌ను పుతిన్ ఎంపిక చేసిన ఆయుధంగా అభివర్ణించింది.
ఈ మిస్సైల్ సామర్థ్యం.. ధ్వని వేగానికి కంటే ఎనిమిదింతలు వేగంగా ఆకాశంలోకి ఎగరగలదు.. 6,138mph (9878kph) అంటే.. 620 మైళ్లు (1,000) కిలోమీటర్లు ఉంటుందని పుతిన్ పేర్కొన్నారు. ఈ మిస్సైల్ సక్సెస్.. కేవలం సాయుధ బలగాల జీవితంలోనే కాదు.. రష్యా చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా పుతిన్ అభివర్ణించారు. రెండు నౌకలు, ఉపరితలం లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో ఈ ఆయుధాలను రష్యా డిజైన్ చేసింది.