Russian Plane: రష్యా విమానం మరొకటి అదృశ్యం..

రష్యాకు చెందిన మరో విమానం కనిపించకుండాపోయింది. ఏఎన్‌-28 శుక్రవారం 13 మంది ప్రయాణికులతో సైబీరియా ప్రాంతం సమీపంలో మిస్‌ అయింది. అధికారుల తెలిపిన దానిని బట్టి 19మంది ఉంటే..

Russian Plane: రష్యా విమానం మరొకటి అదృశ్యం..

Russian Plane

Updated On : July 16, 2021 / 8:30 PM IST

Russian Plane: రష్యాకు చెందిన మరో విమానం కనిపించకుండాపోయింది. ఏఎన్‌-28 శుక్రవారం 13 మంది ప్రయాణికులతో సైబీరియా ప్రాంతం సమీపంలో మిస్‌ అయింది. అధికారుల తెలిపిన దానిని బట్టి 19మంది ఉంటే.. ఆర్ఐఏ నోవోస్టీ ఏజెన్సీ 17 మంది ఉన్నట్లుగా చెబుతుంది.

సైబీరియాలో దేశీయ విమాన సర్వీసులు నిర్వహించే చిన్న విమానయాన సంస్థ సిలా. ఈ సంస్థకు చెందిన ఓ విమానం శుక్రవారం కేడ్రోవి పట్టణం నుంచి టాంస్క్‌ నగరానికి బయల్దేరింది. కాసేపటికే దానికి ఆచూకీ తెలియలేదు. విమానంలో 19 మంది ప్రయాణికులుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హెలికాప్టర్లను రంగంలోకి దించి.. గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

గంటల వ్యవధిలోనే రెస్క్యూ హెలికాప్టర్లు విమానం ఆచూకీ కనిపెట్టేశాయి. ప్రమాద స్థలానికి చేరుకుని దానిలో ఉన్న ప్రయాణికులందరని సురక్షితంగా బయటపడేశాయి. జూలై 6న 28 మంది ప్రయాణికులతో వెళ్లిన విమానం రష్యాలోని పెట్రోపావ్‌లోవిస్క్‌– కామ్‌చట్‌స్కై నగరం నుంచి పలానా నగరానికి 28 మందితో బయలుదేరి కూలిపోయిన సంగతి తెలిసిందే.

విమానానికి సంబంధించిన శకలాన్ని ఒకోట్స్‌ సముద్ర తీరప్రాంతంలో కనుగొన్నారు. విమానం సముద్రంలోని రాతిబండలను గుద్దుకొని ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు. అందులో ఎవరూ ప్రాణాలతో ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.