ప్రపంచంలో తొలి దేశం : మహిళలందరికి ఉచితంగా శానిటరీ పాడ్స్
స్కాట్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల మెరుగైన ఆరోగ్యానికి పెద్ద పీట వేసింది. దేశవ్యాప్తంగా మహిళలందరికి శానిటరీ ఉత్పత్తులు ఉచితంగా ఇవ్వాలని స్కాట్లాండ్

స్కాట్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల మెరుగైన ఆరోగ్యానికి పెద్ద పీట వేసింది. దేశవ్యాప్తంగా మహిళలందరికి శానిటరీ ఉత్పత్తులు ఉచితంగా ఇవ్వాలని స్కాట్లాండ్
స్కాట్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల మెరుగైన ఆరోగ్యానికి పెద్ద పీట వేసింది. దేశవ్యాప్తంగా మహిళలందరికి శానిటరీ ఉత్పత్తులు ఉచితంగా ఇవ్వాలని స్కాట్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా స్కాట్లాండ్ ఘనత సాధించింది. స్కాట్లాండ్ పార్లమెంటులో ఉచిత పీరియడ్ ప్రాడెక్ట్స్ బిల్లుని ప్రవేశపెట్టారు. దీనిపై డిబేట్ జరిగింది. ఆ తర్వాత ఈ బిల్లుకి అన్ని పార్టీల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది.
ఇప్పటికే స్కాట్లాండ్ లోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో శానిటరీ పాడ్స్ ఉచితంగా ఇస్తున్నారు. 2017 నుంచి ఇలా ఇస్తున్నారు. విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇస్తున్న తొలి దేశంగా ప్రపంచపటంలో స్కాట్లాండ్ నిలిచింది. ఇప్పుడు దేశంలోని మహిళలందరికి ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇచ్చే చట్టం తెచ్చింది. ప్రధాన ప్రాంతాల్లో శానిటరీ ఉత్పత్తులను అందరికి అందుబాటులో ఉంచనున్నారు. దీనిపై అన్ని పార్టీల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం అన్నారు. బాలికలతో పాటు మహిళల మెరుగైన ఆరోగ్యం కోసం ఇలాంటివి మరిన్ని చేయాలని సూచించారు.
“మేము సంస్కృతిని మారుస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలు మనం చేస్తున్న వాటిని గమనిస్తున్నాయి. ఇది చాలా ఉత్తేజకరమైన నిర్ణయం” అని స్కాట్లాండ్ ఎంపీ ఒకరు అన్నారు. పీరియడ్ ప్రొడక్ట్స్ (ఫ్రీ ప్రొవిజన్) స్కాట్లాండ్ బిల్లును స్కాటిష్ ఎంపి మోనికా లెన్నాన్ ప్రతిపాదించారు. 2017 లో ముసాయిదా ప్రతిపాదన సమర్పించారు. ఇప్పుడు బిల్లు తెచ్చారు. ఉచిత శానిటరీ ఉత్పత్తుల కోసం ప్రతి ఏటా సుమారు 24.1 మిలియన్ పౌండ్ల డబ్బు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇక ప్రపంచంలోని ఇతర దేశాల సంగతి చూస్తే.. ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, కెన్యా, భారత్, కొలంబియా, మలేషియా, జమైకా, నైజీరియా, ఉగాండా, లెబనాన్ లో పీరియడ్ ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు లేవు. కొంత ధరకు వాటిని విక్రయిస్తున్నారు. స్కాట్లాండ్ మాత్రం.. పూర్తి ఫ్రీగా ఇవ్వనుంది.