ప్రపంచంలో తొలిసారి సముద్ర కెరటాలపై పవర్ ప్లాంట్

ప్రపంచంలో తొలిసారి సముద్ర కెరటాలపై పవర్ ప్లాంట్

Updated On : September 17, 2019 / 4:48 AM IST

రష్యా అద్భుతమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సముద్ర అలలపై తేలియాడే అణు విద్యుత్‌ కేంద్రాన్ని(న్యూ క్లియర్ పవర్ ప్లాంట్) ప్రారంభించనుంది. అలస్కా నుంచి బెరింగ్ సముద్రం మీదుగా గమ్యస్థానానికి చేరుకుంది. రష్యా ప్రభుత్వ న్యూ క్లియర్ ప్లాంట్ రోసాటమ్‌ రూపొందించిన ఈ అణు కేంద్రానికి ‘ది అకడెమిక్‌ లొమొనోసొవ్‌’గా పేరు పెట్టారు. 

రష్యాలోని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్‌ సౌకర్యం అందించేందుకుగానూ దీనిని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఆర్కిటిక్‌ మహాసముద్రంలో 5,000 కి.మీ ప్రయాణించి రష్యాలోని చుకోట్కాలో పీవెక్‌ అనే ప్రాంతానికి చేరుకుంది. ఈ అణు విద్యుత్‌ కేంద్రం బరువు 21 టన్నులు కాగా, ఎత్తు 470 అడుగులు ఉంటుంది. 

రెండు అణు రియాక్టర్లను ఒక్కొక్కటి 35 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని రూపొందించారు. ఈ రియాక్టర్‌ ద్వారా చుకోట్కాలోని 50వేల నుంచి లక్ష మంది వరకూ విద్యుత్‌‌ను అందించవచ్చు. ఏడాది చివరినాటికి ‘ది అకడెమిక్‌ లొమొనోసొవ్‌’ అందుబాటులోకి రానుంది. ఈ ప్లాంట్‌ను ఓసారి ప్రారంభిస్తే 3 నుంచి ఐదేళ్ల వరకూ ఇంధనం మార్చే అవసరమే లేదు. 

త్వరలో అవసరాన్ని బట్టి మొబైల్, చిన్నపాటి సామర్థ్యమున్న ప్లాంట్లను నిర్దిష్ట ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించవచ్చు. అభివృద్ధితో పాటు విమర్శలు ఉన్నట్లుగా కొన్ని గ్రూపులు, పర్యావరణ ప్రేమికులు దీని మూలంగా భద్రతాపరమైన సమస్యలు రావొచ్చని సూచించారు.