China: రాక్ షోలో పాడుతూ ప్యాంటు ఊడదీసిన సింగర్.. పట్టుకెళ్లి లోపలేసిన పోలీసులు

China: రాక్ షోలో పాడుతూ ప్యాంటు ఊడదీసిన సింగర్.. పట్టుకెళ్లి లోపలేసిన పోలీసులు

Updated On : July 29, 2023 / 8:03 PM IST

Shijiazhuang: ఉత్తర చైనాలో జరిగిన రాక్ ఫెస్టివల్‌లో ఇక సింగర్ ప్రదర్శన ఇస్తూ తన ప్యాంటు కిందకు లాగాడు. అంతే స్థానిక పోలీసులు అతడిని నిర్భందించి లోపలేశారు. చైనా రాజధాని బీజింగులో వెలుగు చూసిందీ ఘటన. సింగర్ పేరు డింగ్ అని పోలీసులు గుర్తించారు. సామాజిక నైతికతను దెబ్బతీసినందుకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని షిజియాజువాంగ్ సిటీ స్థానిక సంస్కృతి బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఆ షో నిర్వాహకుడికి 28,000 డాలర్ల జరిమానా విధించారు. అంతే కాకుండా ఇక ముందు ఎలాంటి షోలు నిర్వహించకుండా సస్పెండ్ వేటు వేశారు.

Brahmanandam : బ్ర‌హ్మానందం ఇంట మొద‌లైన పెళ్లి సంద‌డి.. సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

శనివారం నగరంలోని రాక్ హోమ్ టౌన్ ఫెస్టివల్‌లో ప్రదర్శన సందర్భంగా వైలెంట్ షాంపైన్ బ్యాండ్ ఫ్రంట్‌మ్యాన్ తన షార్ట్‌లను కిందకు లాగడం చైనీస్ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. “బ్రీఫ్స్ వదలండి!” అంటూ వీడియోలలో ప్రేక్షకులు పాడటం వినవచ్చు. చైనాలోని సంగీత ప్రేమికులు సంవత్సరాల తరబడి మహమ్మారి లాక్‌డౌన్‌ల తర్వాత ఇటీవలి ప్రత్యక్ష ప్రదర్శనలను ఎంజాయ్ చేస్తున్నారు. బీజింగ్ పరిసర ప్రాంతంలోని హెబీ ప్రావిన్స్ రాజధాని అయిన షిజియాజువాంగ్ సంగీత ప్రదర్శనలకు ప్రసిద్ధి.

IND vs WI 2nd ODI : 10 ఓవర్లు పూర్తి.. భారత్‌ స్కోర్‌ 49/0.. Updates In Telugu

కోవిడ్ అనంతర చైనా ఆర్థిక పునరుద్ధరణ మందగించిన నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించడానికి, వినియోగాన్ని పెంచడానికి అక్టోబర్ వరకు రాక్ హోమ్ టౌన్ పండుగను నిర్వహించనున్నట్లు ఈ నెల ప్రారంభంలో నగర అధికార యంత్రాంగం ప్రకటించింది. కానీ తాజా ఘటనతో అధికారులు తలపెట్టినంత ప్రముఖ స్థాయిలో సంగీత ప్రదర్శనలు జరుగుతాయా అనేది చూడాలంటున్నారు. అయితే గాయకుడి నిర్బంధంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘షిజియాజువాంగ్ రాక్ నగరంగా ఉండాలని కోరుకుంటారు, కానీ మీకు దాన్ని స్వాగతించే ధైర్యం ఉందా?’’ ఒకరు వ్యాఖ్యానించగా, “మీరు రాక్ షో పెట్టే ముందు, అక్కడి నుంచి ముందు మీరు వెళ్లిపోవాలి” అని మరొకరు చమత్కరించారు.