ఎంత కష్టమొచ్చింది, ఒక్క ప్రయాణికుడితోనే విమానాలు నడుపుతున్న ఎయిర్ లైన్స్
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రయాణికులు లేక విమానాలు వెలవెలబోతున్నాయి. వైరస్ కారణంగా

కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రయాణికులు లేక విమానాలు వెలవెలబోతున్నాయి. వైరస్ కారణంగా
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రయాణికులు లేక విమానాలు వెలవెలబోతున్నాయి. వైరస్ కారణంగా ప్రభుత్వాలు ట్రావెల్ బ్యాన్ వంటి ఆంక్షలు విధించడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. చాలావరకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. నిధుల కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎయిర్ లైన్స్ కంపెనీలు.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. కరోనా కారణంగా అనేక దేశాలు తమ బోర్డర్లను మూసివేసిన కారణంగా చాలా విమానాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. రాకపోకలు సాగిస్తున్న విమానాల్లో ప్రయాణికులు లేక దాదాపు ఖాళీగా ఉంటున్నాయి.
కాగా, కొన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు మాత్రం అలానే విమాన సర్వీసులు కంటిన్యూ చేస్తున్నాయి. ఒక్క ప్రయాణికుడు ఉన్నా చాలు, సర్వీసులు కొనసాగిస్తున్నాయి. అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 4511లో అలాంటి ఘటనే జరిగింది. అందులో కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు ఉండటం విశేషం. వాషింగ్టన్ రీగన్ నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి న్యూ ఆర్లీన్స్ కు ఆ విమానం వెళ్తుంది. అందులో 76 సీట్లు ఉన్నాయి. కానీ ప్రయాణికుడు మాత్రం ఒక్కరే. ఆ విమానంలో పైలట్లు, సిబ్బంది ఉన్నారు.
అమెరికన్ ఎయిర్ లైన్స్ గ్రూప్ 119 విమానాలు నడుపుతుంది. అయితే ఇందులో 8 విమానాల్లో కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు ఉంటున్నారు. కాగా ప్రయాణికులు లేకపోయినా విమాన సిబ్బంది మాత్రం విధులు నిర్వహిస్తున్నారు. ఇక న్యూజిలాండ్ కు చెందిన ఓ ఎయిర్ లైన్స్ సంస్థ.. ప్రయాణికులు లేకపోయినా 20 విమాన సర్వీసులు నడిపిస్తోంది. ఏప్రిల్ 1వ తేదీన కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడితో 20 విమానాలు నడిపించడం విశేషం. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి ఉందని ఎయిర్స్ లైన్స్ యాజమాన్యం వాపోయింది. ఒకరిద్దరి కంటే ఎక్కువమంది ప్రయాణికులు ఉండటం లేదన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపింది. అన్ని రకాల వ్యాపారాలు, రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. భారీగా నష్టాలు చూస్తున్నాయి. కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో పర్యాటకం, ఆతిథ్యం, ఎయిర్ లైన్స్ ఉన్నాయి. ఈ రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ నష్టాల నుంచి గట్టెక్కాలంటే చాలా సమయమే పట్టేలా ఉందని వాపోతున్నారు.