Brazil: ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం.. 10మంది మృతి.. వీడియో వైరల్

బ్రెజిలియన్ పర్యాటక పట్టణం గ్రామాడోలో చిన్న విమానం ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణీకులు మరణించగా..

Brazil: ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం.. 10మంది మృతి.. వీడియో వైరల్

brazil plane crash

Updated On : December 23, 2024 / 7:42 AM IST

Brazil Plane Crash: బ్రెజిల్ లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. బ్రెజిలియన్ పర్యాటక పట్టణం గ్రామడోలో చిన్న విమానం ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణీకులు మరణించగా.. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Also Read: Chennai Egmore Express : చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో కలకలం.. ఒక్కసారిగా వ్యాపించిన పొగలు..

బ్రెజిల్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వివరాల ప్రకారం.. బ్రెజిల్ లోని గ్రామడో పర్వత ప్రాంతంలోని ఓ పట్టణం. క్రిస్మస్ వేడుకలు సందర్భంగా ఆ ప్రాంతంలో రద్దీ నెలకొంది. అయితే, ఓ చిన్న విమానం తొలుత ఇళ్లను ఢీకొట్టి చివరకు ఫర్నీచర్ దుకాణంలోకి దూసుకెళ్లింది. దుకాణంలో ఉన్న ఇద్దరు సహా, విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మరణించారు. విమానంలో ప్రయాణిస్తూ మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు పేర్కొన్నారు. విమానం గ్రామాడోకు కొద్ది దూరంలో ఉన్న కెనెలా నుంచి బయలుదేరింది. సావోపాలో రాష్ట్రంలోని జుండియామ్ కు వెళ్తుంది. విమానం టేకాఫ్ అయ్యి మూడు కిలో మీటర్ల దూరం ప్రయాణించిన తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక మీడియా తెలిపింది.

Also Read: Video: చాలా మంచి పెంగ్విన్‌.. ప్రేమికులను డిస్టర్బ్‌ చేయకుండా ఈ పెంగ్విన్‌ ఏం చేసిందో చూడండి 

ప్రమాదం సమయంలో ఓ వ్యాపారవేత్త ఈ విమానానికి పైలట్ గా ఉన్నాడని, అతను తన సొంత పిల్లలతోపాటు మరికొంత మంది కుటుంబ సభ్యులతో అందులో ప్రయాణిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే, విమానం కుప్పకూలిన వెంటనే మంటలు వ్యాపించాయి. దీంతో ఆ విమానం దగ్దమైంది. ప్రమాదం జరిగిన సమయంలో దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.