స్పేస్ లో సందడి : తొలి ప్రైవేటు అంతరిక్షయానం

స్పేస్ లో సందడి : తొలి ప్రైవేటు అంతరిక్షయానం

SpaceX : స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్‌ విషయంలో ముందడుగు వేశారు. 2021 చివరి నాటికి ఈ మిషన్‌ను ఆకాశంలోకి తీసుకెళ్లాలని డెడ్‌లైన్ పెట్టేసుకున్నారు. ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు డ్రాగన్ క్రూ క్యాప్సుల్‌ను వినియోగించబోతున్నారు. ఈ క్యాప్సుల్ ద్వారా నలుగురు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపనున్నారు.
ఇందుకోసం షిఫ్ట్ 4 పేమెంట్స్ అనే ప్రైవేటు సంస్థతో స్పేస్ఎక్స్ ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ సీఈవో పైలట్ జేర్డ్ ఐసాక్‌మన్ ఈ వ్యోమనౌకకు నాయకత్వం వహిస్తారని స్పేస్‌ఎక్స్ తెలిపింది.

స్పేస్ క్యాప్సుల్‌లోని నాలుగు సీట్లనే ఐసాక్‌మన్ కొనుగోలు చేయడంతో మిగిలిన మూడు సీట్లను కూడా ఆయనే భర్తీ చేయనున్నారు. తనకు నచ్చిన వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జర్నీ కోసం వ్యోమగాములకు అవసరమైన శిక్షణను ఇన్‌స్పిరేషన్ 4 సిబ్బంది ఇవ్వనున్నట్లు స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. ఆర్బిటాల్ మెకానిక్స్, జీరో గ్రావిటీని తట్టుకోవడం సహా ఇతర అంశాలపై వారికి శిక్షణ ఇవ్వనున్నారు. అత్యవసర సన్నద్ధత, స్పేస్​సూట్ – స్పేస్​క్రాఫ్ట్ ప్రవేశం, పూర్తిస్థాయి సిమ్యులేషన్​పై శిక్షణ అందించనున్నారు.

దీనికోసం డ్రాగన్ వ్యోమనౌకతో పాటు ఫాల్కన్ 9 వ్యోమనౌకను వినియోగించుకోనున్నారు. స్పేస్ జర్నీ కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని, అందులో భాగంగా స్పేస్ క్రాఫ్ట్ ప్రతి 90 నిముషాలకు భూమి చుట్టూ ఒక రౌండ్ తిరుగుతుందని స్పేస్ఎక్స్ వెల్లడించింది. దీనికోసం ఓ నిర్దేశిత కక్ష్యను కూడా ఎంచుకున్నట్లు తెలిపింది. మొత్తం ట్రిప్ ముగిసిన తరువాత డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో నీటిపై సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. స్‌ఎక్స్ ఈ మెగా మిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తే ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే వారి డ్రీమ్స్ తీరనున్నాయి. ఖర్చైనా సరే వెళ్లాలనుకునే వారు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తున్నారు.