Intestine Transplant Successful : ఏడాదిన్నర పాపకు పెద్దపేగు మార్పిడి ఆపరేషన్ సక్సెస్‌.. ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్‌ ఇదే మొదటిది

స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో లాపాజ్‌ హాస్పిటల్‌ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఏడాదిన్నర పాపకు పెద్దపేగు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్‌ ఇదే మొదటిది కావడం గమనార్హం.

Intestine Transplant Successful : ఏడాదిన్నర పాపకు పెద్దపేగు మార్పిడి ఆపరేషన్ సక్సెస్‌.. ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్‌ ఇదే మొదటిది

intestine transplant

Updated On : October 14, 2022 / 6:53 AM IST

Intestine Transplant Successful : స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో లాపాజ్‌ హాస్పిటల్‌ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఏడాదిన్నర పాపకు పెద్దపేగు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలో ఈ తరహా ఆపరేషన్‌ ఇదే మొదటిది కావడం గమనార్హం. గుండెనొప్పితో మరణించిన దాత నుంచి సేకరించిన పెద్దపేగును పాపకు అమర్చారు.

Tadepalle Manipal Hospitals : 8ఏళ్ల చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి.. అరుదైన ఆపరేషన్ చేసిన మణిపాల్ ఆసుపత్రి వైద్యులు

ఎమ్మా అనే పేరు గల ఆ పాప సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లిపోయిందని ఆస్పత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. పాప పుట్టిన నెలలోపే పెద్దపేగు సమస్య బయటపడింది. ఆమెకు పెద్దపేగు మాత్రమే కాకుండా కాలేయం, ప్లీహం, క్లోమగ్రంథి కూడా అమర్చాల్సి వచ్చింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.