యుద్ధం జరిగితే ఇరాన్, ఇజ్రాయెల్‌లో గెలుపెవరిది? ఏ దేశం ఎవరివైపు..
ఈ దాడులు ఏ విలయానికి, ఎలాంటి విధ్వంసానికి దారితీయబోతున్నాయి?

Iran Israel War : యుద్ధానికి కారణాలు అక్కర్లేదు. సాకులు చాలు. రక్తంతో తడిచిన చరిత్ర పేజీలను తిరగరాస్తే చెప్పేది ఇదే. ఎవడో ఫెర్డినాండ్ ను చంపాడని ప్రపంచం అంతా మొదటి యుద్ధం చేస్తే హిట్లర్ పైశాచికత్వం రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కూడా అలాంటి పరిస్థితులకే దారితీస్తుందా? ఇరాన్ మీద దాడితో ఇజ్రాయెల్ ఏం చెప్పాలనుకుంటోంది? మరి ఇరాన్ రియాక్షన్ ఏంటి? ఈ రెండు దేశాల వైరంతో మూడో ప్రపంచ యుద్ధం భయం మొదలైనట్లేనా?
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరితే.. ఏ దేశం ఎటువైపు? ఈ యుద్ధం ప్రభావం ప్రపంచం మీద ఎంత? అప్పట్లో గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మన అనుకున్న వాళ్లతోనే. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అలాంటిదే. ఫ్రెండ్ షిప్ కు కేరాఫ్ అనిపించిన ఈ రెండు దేశాలు ఆ తర్వాత బద్ధ శత్రువులుగా మారాయి. ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో వరల్డ్ వార్ వచ్చేసినట్లేనా? ఇరాన్ వైపు ఉన్నది ఎవరు? ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచింది ఎవరు? ఈ దాడులు ఏ విలయానికి, ఎలాంటి విధ్వంసానికి దారితీయబోతున్నాయి?
2వేల కిలోమీటర్లకు పైగా ట్రావెల్ చేసి మరీ.. ఇజ్రాయెల్ కు చెందిన 100 ఎఫ్ 35 అదిర్ యుద్ధ విమానాలు ఇరాన్ మీద దాడి చేశాయి. టెహ్రాన్, కరాజ్ లో నిర్ధిష్ట లక్ష్యాలపై దాడులు జరిపింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడి.. 1981లో ఇరాక్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడిని పోలి ఉందనే చర్చ జరుగుతోంది. 1981 జూన్ లో ఇరాక్ పై జరిపిన దాడిని ఆపరేషన్ ఒపేరా అంటారు. ఇజ్రాయెల్ కి ఇరాన్, ఇరాక్ దేశాలు చాలా దూరం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 2వేల 300 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటే.. ఇజ్రాయెల్ నుంచి ఇరాక్ కు 1100 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
1981లో ఆపరేషన్ ఒపేరా సమయంలో 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను శత్రు దేశాలను దాటుకుని పరిమిత ఇంధనంతో దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు కూడా అలాంటి పనే చేసింది ఇజ్రాయెల్. 2వేల కిలోమీటర్లు దాటుకుని మరీ ఇరాన్ పై అటాక్ చేసింది. 1981లో ఇరాక్ పై దాడిలో ఎఫ్ 16 ఏను ఉపయోగించింది. ఎఫ్ 15 ఏ ఎస్కార్ట్ అందించాయి. ఇప్పుడు ఎఫ్ 35లో ఇరాన్ పై దాడులు చేసింది ఇజ్రాయెల్.
Also Read : దారికొచ్చిన డ్రాగన్..! మోదీ విదేశాంగ విధానంతో జిన్‌పింగ్ మైండ్ బ్లాక్..!