ఆన్‌లైన్‌లో స్పాట్ రోబో డాగ్ సేల్.. విలువ 75వేల డాలర్లు.. కండీషన్స్ అప్లయ్!

రోబోటిక్స్ సంస్థ బోస్టన్ డైనమిక్స్ డాగ్ ఆకారంలో నాలుగు కాళ్ల స్పాట్ రోబోట్ లను తయారు చేసింది. ఈ రోబోను మంగళవారం ఆన్ లైన్ లో కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉంచింది. దీని వేల 75వేల డాలర్లు తో అమ్మకం ప్రారంభించింది. దానితో పాటు కొన్ని షరతులను విధించింది. స్పాట్ రోబోట్లు చాలా చురుకైనవి, నడుస్తాయి, మెట్లు ఎక్కుతాయి. తలుపులను తెరవగలవు. కానీ వీటిని ఆన్ లైన్ లో కొనుగోలు చేసే వ్యక్తులు ఎటువంటి పరిస్థితులల్లోను వీటిని ఆయుధాలుగా ఇతరులపై ఉపయోగించమని హామీ ఇవ్వాలని తెలిపింది.
రోబోలు ప్రజలకు హాని కల్గించవు అని తెలియజేయటం మా ముఖ్య లక్ష్యం అని ప్రముఖ వ్యాపార సంస్ధ ఉపాధ్యక్షుడు మైఖేల్ పెర్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా ఎవరో వ్యక్తి ఈ స్పాట్ లను హాంటెడ్ హౌస్ కోసం ఉపయోగించాలనుకున్నారు. కానీ దానికి మేము నో చెప్పాము అని ఆయన తెలిపారు. స్పాట్ రోబోట్ లు ఇంటి పనుల కోసం సురక్షితమైనదిగా ధృవీకరించలేదని అన్నారు. స్పాట్ రోబోట్ లను కొనుగోలు చేసిన వ్యక్తులు షరుతులను ఉల్లంఘిస్తే కంపెనీ వారి వారంటీని రద్దు చేస్తుంది. రోబోట్లను తిరిగి రిపేర్ చేయదు, మళ్లీ వారి లైసెన్స్ ను తిరిగి పునరుద్దంచదని పెర్రీ చెప్పారు.
బోస్టన్ డైనమిక్స్ సంస్థ కొన్ని దశాబ్దాలుగా సైనిక నిధులతో పరిశోధన సామర్ధ్యం కలిగిన రోబోట్లను అభివృద్ధి చేస్తోంది. మసాచుసెట్స్ లో 1992లో స్ధాపించిన తరువాత మెుదటిసారిగా వాణిజ్య అనువర్తనాలను ప్రారంభించింది. డాగ్ ఆకారంలో ఉండే ‘స్పాట్’రోబోట్ల ఉత్పత్తిని ప్రారంభిస్తున్నామని కంపెనీ గత సంవత్సరమే ప్రకటించింది.
ముందుగా వీటిని పైలట్ ప్రాజెక్టు, నిర్మాణ స్థలాలను పర్యవేక్షించటానికి, ఇంధన సౌకర్యాలను పరిశీలించటం, పార్కులు వంటి ప్రదేశాలల్లో ఉపయోగించటం కోసం 150 రోబోట్లను లీజుకు తీసుకుంది. మనుషులు రోబోలను రిమోట్ సహాయంతో ఆపరేట్ చేస్తారు. కానీ కొన్ని సెట్టింగ్స్ ఆధారంగా రోబోలు స్వయంగా పని చేయగలవు. వీటి రీఛార్జింగ్ సమయాన్ని ముందు సుమారు 90 నిమిషాల పాటు నడుస్తాయని అంటున్నారు.
ఇటీవల సింగపూర్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందటానికి ముందు ప్రజలను సామాజిక దూరం పాటించమని చెప్పటానికి ఉపయోగించారు. ముందుగా రికార్డ్ చేసిన సందేశాలను ప్రసారం చేయటానికి ఈ స్పాట్ రోబోట్లను పబ్లిక్ ప్రదేశాలు, పార్కులల్లోను ఉంచారు. తర్వాత బోస్టన్ హాస్పటల్ లో కోవిడ్ 19 ట్రయాజ్ సెంటర్ లో రోగులను ఇంటర్వ్యూ చేయడానికి, వారి శరీర ఉష్ణోగ్రతలను చూడటానికి వీటిని ఉపయోగించినట్లు తెలిపారు. బోస్టన్ డైనమిక్స్ సంస్థ రోబోట్లను యుఎస్ లో మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపింది.