శ్రీలంక బాంబు పేలుళ్లు : 321 చేరిన మృతులు

శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 321కు చేరుకుంది. వీరిలో 10మంది భారతీయులున్నారు. కాగా ఈ దాడులలో మరో 500ల మందికి గాయాలయ్యాయి. కాగా మృతుల మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. శ్రీలంకలో ఉగ్రదాడి తామే బాధ్యులమని ISIS ప్రకటించింది.
శ్రీలంకలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడి 8 చోట్ల బాంబులు దాడులకు పాల్పడ్డారు. ఈస్టర్ ఆదివారం (ఏప్రిల్ 21)న చర్చిల్లో ప్రార్థనలకు వచ్చే క్రైస్తవులు, విదేశీ పర్యాటకుల తాకిడి ఉండే మూడు హోటల్స్‌ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. కాగా ఈ పేలుళ్ల కేసులో ప్రభుత్వం 40మంది అనుమానితులను అరెస్ట్ చేసింది. వారిని విచారిస్తున్నారు. వరుసగా జరిగిన ఈ పేలుళ్లతో ఏప్రిల్ 22 రాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రభుత్వం. మంగళవారం జాతీయ సంతాపదినంగా పాటిస్తున్నారు.