laziest citizen contest : నిలబడకూడదు.. కూర్చోకూడదు.. లేజియెస్ట్ సిటిజన్ పోటీ.. ఎక్కడంటే?

ఆ గ్రామంలో ఓ వింత పోటీ జరుగుతోంది. ఆ పోటీలో నిలబడకూడదు.. కూర్చోకూడదు. పడుకునే ఉండాలి. ఇదేం పోటీ అని షాకయ్యారా? ఆగస్టులో మొదలైన ఈ కాంపిటేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. వివరాలు చదవండి.

laziest citizen contest : నిలబడకూడదు.. కూర్చోకూడదు.. లేజియెస్ట్ సిటిజన్ పోటీ.. ఎక్కడంటే?

laziest citizen contest

laziest citizen contest : ఆ దేశంలో ఓ వింత పోటీ జరుగుతోంది.. ఈ పోటీలో నిలబడకూడదు.. కూర్చోకూడదు.. గెలుపొందిన వారికి మంచి బహుమతి కూడా ఉంది. లేజియస్ట్ సిటిజన్‌గా పేరొస్తుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ.. ఎక్కడంటే?

Strange Disease : ఈ వింతవ్యాధి సోకితే డ్యాన్స్ చేస్తునే ఉంటారట..! డ్యాన్స్ చేస్తునే చనిపోతారట..!!

సౌత్ మాంటెనెగ్రోలోని బ్రెజ్నా అనే విలేజ్‌లో ఓ వింత పోటీ జరుగుతోంది. అదే ‘లేజియెస్ట్ సిటిజన్’ .. తెలుగులో సోమరితనం పౌరుడు అన్నమాట. 21 మంది పోటీదారుల్లో ఏడుగురు మిలిగి ఉన్నారట.  ఏటా జరిగే ఈ పోటీని ఈ సంవత్సరం ఆగస్టు మధ్యలో ప్రారంభించారు. ఇప్పుడు 26వ రోజుకు చేరుకుందట. ఇంతకీ పోటీ ఏంటనుకున్నారు.. పోటీలో నిలబడకూడదు.. కూర్చోకూడదు. రోజుకు దాదాపు 24 గంటల పాటు చాప మీద పడుకుని ఉంటారు. అలా ఎవరు ఎక్కువ సేపు ఉండగలరో వారికి $1,070 ( ఇండియన్ కరెన్సీలో రూ. 88,000) బహుమతిగా ఇస్తారు.

Assam : ఆ గ్రామంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి.. ఆ వింత గ్రామం ఎక్కడంటే?

పోటీ నియమాలు ఏంటంటే పోటీలో ఉన్నవారికి ఆహారం, పానీయాలు తాగొచ్చు. పుస్తకాలు చదువుకోవచ్చు. ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు. అయితే కూర్చోకూడదు.. నిలబడకూడదు ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించాలట. టాయిలెట్‌కి వెళ్లాలంటే ప్రతి 8 గంటలకు ఒకసారి 10 నిముషాలు టైం మాత్రం ఇస్తారట. పోటీ మొదటగా 21 మందితో ప్రారంభమైంది. ఏడుగురు పోటీదారులు ఇప్పటివరకూ 463 గంటలు పడుకున్నారట. ఈ పోటీ గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని 2021 లో ఈ పోటీలో గెలియిన దుబ్రావ్కా అక్సిక్ వెల్లడించారు.