Stormy Cheers: నార్త్‌ కొరియా కిమ్ శాడిజం.. మైనస్‌ 15 డిగ్రీల ఉష్టోగ్రతలో!

నార్త్‌కొరియా నరకాసురుడు.. అధ్యక్షుడు కిమ్‌ చెప్పినట్టు చేయకుంటే జైలుకు.. వినకుంటే పైకి పంపించేస్తాడు.

Stormy Cheers: నార్త్‌ కొరియా కిమ్ శాడిజం.. మైనస్‌ 15 డిగ్రీల ఉష్టోగ్రతలో!

Kim

Updated On : February 19, 2022 / 4:29 PM IST

Stormy Cheers: నార్త్‌కొరియా నరకాసురుడు.. అధ్యక్షుడు కిమ్‌ చెప్పినట్టు చేయకుంటే జైలుకు.. వినకుంటే పైకి పంపించేస్తాడు. కిమ్‌కి కోపమొస్తే అంతే.. తన కోసం ప్రజలు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండాలని శాసిస్తాడు. కిమ్ జాంగ్‌ ఉన్ శాడిజం అదే. ఎవరేమైనా పర్వాలేదు కానీ తాను అనుకున్నది మాత్రం జరగాలి.

లేటెస్ట్‌గా తన ప్రసంగం కోసం దేశ ప్రజలను, అధికారులను ఎముకలు కొరికే చలిలో అరగంటసేపు నిలబెట్టి నరకం స్పెలింగ్ రాయించాడు. తండ్రి కిమ్ జోంగ్‌ ఇల్‌ 80వ జయంతి వేడుకలను సంజియాన్ నగరానికి బయట.. మైనస్‌ 15 డిగ్రీల ఉష్టోగ్రతలో భయంకర వాతావరణంలో నిర్వహించాడు కిమ్.

బహిరంగ సభకు ప్రజలు రాక తప్పని పరిస్థితిలో పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ సభలో సుమారు అరగంట పాటు ప్రసంగించిన కిమ్ మాటలను.. వేళ్లు మెలి తిరిగినా.. కాళ్లు చలనం కోల్పోయినా.. కదిలితే ఎక్కడ కాల్చివేస్తాడో అనే భయంతో కదలకుండా విన్నారు ప్రజలు.

ప్రజలు ఇబ్బంది పడుతుంటే కిమ్‌తో పాటు వేదికపైన ఉన్న కొందరు అధికారులు తమ శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి హీటర్లను వాడారంట. వేదికపైన రెడ్ కార్పెట్ కింద విద్యుత్ వైర్లు కనిపిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శాడిస్ట్‌ కిమ్‌ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.