Amazing : నీళ్లల్లో ఈత కొట్టే మామిడి పండు .. దీని విశేషాలు బోలెడు

మామిడి పండును నీళ్లల్లో వేస్తే బుడుంగున మునిగిపోతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ‘బంగినపల్లి మామిడిపండు’మాత్రం నీళ్లల్లో వేసే ఈత కొడుతుంది. ఈదుకుంటూ రయ్ మంటూ వెళ్లిపోతుంది.

Amazing : నీళ్లల్లో ఈత కొట్టే మామిడి పండు .. దీని విశేషాలు బోలెడు

Amazing Fish

Updated On : July 21, 2023 / 1:18 PM IST

Rothralin moliagris, Guinea fowl puffer : పండ్లలో రారాజు మామిడి పండు. మామిడిలో ఎన్ని రకాలున్నా ‘బంగినపల్లి మామిడిపండు’(banginapalli mamidi)కు రేంజే వేరే. ఆ టేస్టే వేరు.అటువంటి మామిడిపండ్లు అంటే ఇష్టపడనివారు ఉండరు. ఇంతకీ మామిడిపండు గురించి చెబుతు నోరూరిస్తు వార్తేంటీ అనుకుంటున్నారా..? సాధారణంగా మామిడి పండును నీళ్లల్లో వేస్తే బుడుంగున మునిగిపోతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ‘బంగినపల్లి మామిడిపండు’మాత్రం నీళ్లల్లో వేసే ఈత కొడుతుంది. ఈదుకుంటూ రయ్ మంటూ వెళ్లిపోతుంది. అదేంటీ మామిడిపండు ఈదటమేంటీ..?మరీ విడ్డూరం అనుకుంటున్నారా..? మీరనేది కడా నిజమే మరి..

ఈ మామిడి పండు ప్రత్యేకత అటువంటిది మరి.. ఇంతకీ ఏంటీ ఆ ప్రత్యేకత అంటే..అది ఓ చేప. మామిడిపండులాంటి చేప. అందుకే అది నీళ్లలో వేస్తే ఈదేస్తుంది అని చెప్పేది. ఈ అందమైన సృష్టిలో ఈ మామిడిపండులాంటి చేప కూడా ఓ అద్భుతమనే చెప్పాలి. అచ్చంగా మామిడి పండును పోలిన ఈ చేపను ‘రోథ్రాలిన్‌ మోలియాగ్రిస్‌ (Rothralin moliagris, )అనీ, గినియా ఫౌల్‌ పఫర్‌’ (
Guinea fowl puffer)అనీ పిలుస్తారు. ఈ చేప మిగలముగ్గిన (పండిన) మామిడి పండు రంగులో ఉంటుంది.

Tierra Young Allen..Dubai Jail : పబ్లిక్ ప్లేస్‌లో గట్టిగా అరిచిందని అరెస్ట్ .. రెండు నెలలుగా జైల్లోనే టిక్ టాక్ స్టార్

సాధారణంగా నీళ్లలో జీవించే చేపలు ప్రత్యేకించి నీళ్లు తాగవని అంటారు. కానీ ఏ జీవికైనా నీరే ఆధారం కాబట్టి చేపలు కూడా నీళ్లు తాగుతాయని పరిశోధకులు చెబుతుంటారు. కానీ ఈ మామిడిపండులాంటి చేప మరీ ప్రత్యేకం. ఈ చేప నీళ్లను బాగా మింగేస్తుంది. అలా మింగడం వల్ల దాని శరీరం బొద్దుగా తయారవుతుంది. అసలే పసుపు రంగులో ఉండే ఈ చేప నీరు మింగినప్పుడు అచ్చంగా బాగా పండిన మామిడి పండులా తయారవుతుంది. సాధారణంగా ఉంటే ఈ చేప కాస్త బొద్దుగా ఉంటుంది. కానీ నీరు మింగినప్పుడు మాత్రం ఈ చేపలు మరీ బొద్దుగా బంగినపల్లి మామిడి పండులా కనిపిస్తాయి.

పట్టుకోగానే మెత్తగా ఉండే ఈ చేపల్లో కొన్ని చర్మంపైన ఎలాంటి మచ్చలూ లేకుండా బాగా పండిన బంగినపల్లి మామిడి పండులా కనిపిస్తాయి. వీడికుండే చిన్ని నోరు భలే ముద్దుగా ఉంటుంది. చిన్ని నోరూ, కళ్లూ, చెవులూ, ఉండీ లేనట్టున్న తోకతో ఈ చేపలు చూడటానికి భలే ముద్దుగా ఉంటాయి. ఈ జాతిలో కొన్ని విషపూరితమైనవీ ఉంటాయట. అందుకే వీటిని పెంచడానికి తప్ప… తినడానికి వాడరట. మరి తెలిసాక కూడా అంత ధైర్యం ఎవరు చేస్తారు..? కాబట్టి వీటి గురించి తెలిసినవారు ఎవ్వరు తినరు. ఇవి ఎక్కువగా తూర్పు పసిఫిక్‌ దేశాలైన చైనా, థాయ్‌లాండ్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, ఫిజీ వంటి దేశాల్ల్లోనే కనిపిస్తాయి. మరి భలే ముద్దుగా ఉన్నాయి కదూ ఈ మామిడిపండు చేప విశేషాలు..

Seema Haider : పాక్ మహిళ సీమాహైదర్ కేసులో షాకింగ్ విషయాలు