మియన్మార్, బ్యాంకాక్ లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. వీడియోలు వైరల్.. థాయిలాండ్ ఎమర్జెన్సీ
మియన్మార్, బ్యాంకాక్ లలో భారీ భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి.. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Earthquake Myanmar
Earthquake Myanmar: మియన్మార్ లో భారీ భూకంపం సంభవించింది. రికర్ట్ స్కేల్ పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. సెంట్రల్ మియన్మార్ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలో మీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది.
Also Read: India : ఫారిన్ మోజుతో దేశాన్ని వీడుతున్న శ్రీమంతులు.. కోటక్ ప్రైవేట్ సర్వేలో షాకింగ్ వాస్తవాలు
మియన్మార్ లో భారీ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో తీవ్ర భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పలు దఫాలుగా ప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, బ్యాంకాక్ లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. భూకంపం కారణంగా పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక థాయిలాండ్ లో ఎమర్జెన్సీ విధించారు. భూకంపం తీవ్రత అధికంగా ఉండడంతో ప్రధాని షినవ్రత
Breaking: Video shows water falling from a rooftop pool after earthquake tremors hit Bangkok. pic.twitter.com/nzoKKo42fg
— PM Breaking News (@PMBreakingNews) March 28, 2025
బ్యాంకాక్ లో భారీ భూకంపం కారణంగా భవనాలు కూలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోని నీరు కిందకు పడిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు మియన్మార్ లోనూ అనేక భవనాలు ధ్వంసమైనట్లు తెలిసింది. మియన్మార్ లోని మండలేలో ఉన్న ఐకానిక్ అవా వంతెన ఇరావడీ నదిలో కూలిపోయింది.
Not sure what’s happening in Bangkok right now; I was on the BTS when it started shaking like an earthquake at a stop and we all got off to see this in the distance. Past Chatuchak Park from the Mo Chit @BTS_SkyTrain station… now looking like ashes are falling. Anyone with info… pic.twitter.com/0ncd5lBOMi
— Max Balesteri (Meandering Max) (@MaxBalesteri) March 28, 2025
Small earthquake in 🇹🇭 pic.twitter.com/bYtgRK9c8S
— Alex MacGregor (@alexmacgregor__) March 28, 2025
BREAKING: Closeup video shows the moment skyscraper collapses in Bangkok, Thailand from powerful earthquake.pic.twitter.com/IKhRrecvQc
— AZ Intel (@AZ_Intel_) March 28, 2025
Another aftermath video from Mandalay after it was hit by powerful 7.7 earthquake#earthquake #Myanmar pic.twitter.com/MUgIwctxm6
— Masood (@Masood9876) March 28, 2025
No more swimming lessons today 🤯 #playatpool #earthquake #bangkokearthquake #mandalayearthquake pic.twitter.com/PNT3z2PAOY
— Nicolas Vanhove (@NicolasVanhove) March 28, 2025
ఇక భూకంపం ప్రభావం భారత్ లో కూడా కనిపించింది. కోల్ కతా, ఇంఫాల్, మేఘాలయలో ప్రకంపనలు వచ్చాయి.