Superdad: ఒక చేత్తో పాపకు పాలు పడుతూనే బాల్ క్యాచ్ అందుకున్న తండ్రి

పేరెంట్ అవడం కంటే అదొక కొత్త బాధ్యత. ప్రత్యేక శ్రద్ధ పెడితేనే ఆ పనిని చక్కగా నిర్వర్తించగలం. పిల్లల పనులతో పాటు ఫుడ్ అలవాట్లు కూడా వేరేగా ఉండటంతో ఎక్కడికెళ్లినా వారికి కావాల్సిన వాటిని తీసుకెళ్లాల్సిందే. ఇలాగే బేస్ బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన తండ్రి..

Superdad: ఒక చేత్తో పాపకు పాలు పడుతూనే బాల్ క్యాచ్ అందుకున్న తండ్రి

Father Caught

Updated On : April 27, 2022 / 4:57 PM IST

Superdad: పేరెంట్ అవడం కంటే అదొక కొత్త బాధ్యత. ప్రత్యేక శ్రద్ధ పెడితేనే ఆ పనిని చక్కగా నిర్వర్తించగలం. పిల్లల పనులతో పాటు ఫుడ్ అలవాట్లు కూడా వేరేగా ఉండటంతో ఎక్కడికెళ్లినా వారికి కావాల్సిన వాటిని తీసుకెళ్లాల్సిందే. ఇలాగే బేస్ బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన తండ్రి.. పాపకు పాలు పడుతూనే తన వైపుగా వచ్చిన బాల్ ను క్యాచ్ అందుకున్నాడు.

సాధారణంగా స్టేడియంలో అభిమానులు ఫౌల్ బాల్ క్యాచ్ పట్టడం విశేషం కాదు. ఒక బాటిల్ లోని పాలు పడుతూ మరో చేత్తో క్యాచ్ అందుకోవడం ప్రత్యేకం. ఈ ఘటన అమెరికాలోని సిన్సిన్నాటీలో జరిగింది. మేజర్ లీగ్ బేస్ బాల్ గేమ్‌లో భాగంగా సిన్సిన్నాటీ రెడ్స్ వర్సెస్ శాన్ డిగో పాడ్రెస్ మ్యాచ్ జరిగింది.

ఈ ఘటన అక్కడి కెమెరాలో రికార్డ్ అయింది. బాల్ వస్తుండగానే దానిని పట్టుకునేందుకు స్టేడియంలోని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.. ఎలా అయితే స్టాండ్ లో కూర్చొన్న వారిలో ఒక వ్యక్తి మాత్రం చెయ్యెత్తి బంతి అందుకున్నాడు. అతని ఒళ్లో చూస్తే ఒక పాప. మరో చేత్తో ఆ పాపకు పాలు పడుతూ ఉన్నాడు.

Read Also : పిల్లాడిపై దాడి చేసిన కుక్క.. కాళ్ల‌ను నరికిన తండ్రి

సహజంగానే అది చూసిన వారంతా షాక్ అయిపోయారు. ప్రత్యేకించి అతని పక్కనే కూర్చొన్న భార్య కూడా షాకింగ్ గా ఫీల్ అయింది. అతను క్యాచ్ భలే అందుకున్నాడని అంతా కాంప్లిమెంట్ ఇస్తుంటే.. ఆ తండ్రి మాత్రం పిల్లలను బయటకు తీసుకెళ్లేటప్పుడు సేఫ్టీ ముఖ్యమని తాను అప్రమత్తంగా ఉండటం వల్లే పట్టుకోగలిగానని చెప్తున్నాడు.