అమెరికా టాప్ పొలిటీషియన్స్ పై చైనా “హనీ ట్రాప్”

అమెరికా టాప్ పొలిటీషియన్స్ పై చైనా “హనీ ట్రాప్”

Updated On : December 23, 2020 / 9:17 PM IST

Suspected Chinese spy ‘honey-trapped’ top US politicians అమెరికాలోని ముఖ్యమైన రాజకీయనాయకులపై.. చైనా హనీట్రాప్ కి పాల్పడినట్లు సమచారం. ఓ చైనా మహిళ…మేయర్లు,ఎంపీలు వంటి ముఖ్యమైన అమెరికా రాజకీయనాయకులే లక్ష్యంగా హై ప్రొఫైల్ హనీ ట్రాప్ కి పాల్పడినట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించినట్లు యూఎస్ కి చెందిన న్యూస్ వెబ్ సైట్ ఆక్సోయిస్ ఓ రిపోర్ట్ లో తెలిపింది. చైనా యొక్క ప్రధాన పౌర గూఢచర్య సంస్థ..మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ(MSS)తరపున..ఫంగ్ ఫంగ్ అనే చైనా మహిళ ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం.

2011-15 మధ్యలో ఫంగ్ ఫంగ్..అమెరికాలో పొలిటికల్ పవర్ పొందేందుకు దేశమంతా తిరుగుతూ స్థానిక,జాతీయ నాయకులతో దగ్గరి సంబంధాలను ఏర్పరుచుకున్నట్లు రిపోర్ట్ లో తెలిపారు. ఆ మహిళ వలలో పడినవారిలో ప్రస్తుత మరియు మాజీ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉన్నట్లు ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు.

సెక్సువల్ రిలేషన్ షిప్,రొమాంటిక్,వ్యక్తిగత చరిష్మా,తీవ్రమైన నెట్ వర్కింగ్,క్యాంపెయిన్ ఫండ్ రైజింగ్ వంటి వాటి ద్వారా ఫంగ్ ఫంగ్..అమెరికా నాయకులతో దగ్గరి సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు తెలిపారు. ఇద్దరు మేయర్లతో ఆమెకు సెక్సువల్ సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. యూఎస్ మేయర్ల రీజినల్ కాన్ఫరెన్స్ లకు కూడా ఫంగ్ హాజరయినట్లు గుర్తించారు. ఆమె లగ్జరీ కార్లతో తిరుగూ విలాసవంతమైన జీవతం గడిపేదని..పార్టీలు,విందులు వంటి వాటితో చాలా మంది అధికారులు నాయకులకు వల వేసేదని రిపోర్ట్ లో తెలిపారు.

శాన్ ఫ్రాన్సిస్క్ కాన్సేలేట్ లో మరో అండర్ కవర్ దౌత్యవేత్తపై తాము అనుమానంతో నిఘా పెట్టినసమయంలో మొట్టమొదటగా ఫంగ్ కార్యకలాపాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. ఆ అండర్ కవర్ దౌత్యవేత్త కూడా పొలిటికల్ ఇంటెలిజెన్స్ గేథర్ చేయడంపై ఫోకస్ పెట్టాడని,ఫంగ్ తో అతను తరుచుగా ఫోన్ లో మాట్లాడేవాడని గుర్తించినట్లు యూఎస్ అధికారులు చెప్పారు.

ఫంగ్ తన 28-30ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు 2011లో బే ఏరియా యూనివర్శిటీ విద్యార్థిగా చేరింతదని ఆమె స్నేహితులు చెప్పారు. అయితే 2015లో ఫంగ్.. వాషింగ్టన్ లో ఓ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉన్న సమయంలో అకస్మాత్తుగా తాను చైనా వెళ్లాల్సిన పని పడిందంటూ ఆమె చెప్పిందని, ఆతర్వాత ఆమె అమెరికా నుంచి అదృశ్యమైపోయినట్లు చెప్పారని రిపోర్ట్ లో పేర్కొన్నారు.

ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ ఆపరేషన్… చైనాకి సంబంధించిన విదేశీ విధానాలను ప్రభావితం చేసే లక్ష్యంతో చైనా చేపట్టిన దుందుకుడు పొలిటికల్ గేథరింగ్ ఆపరేషన్స్ ఇప్పుడు ఆందోళన కలిగించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఇటీవల బయటపడిన చైనా లీక్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. షాంఘైలో వివిధ దేశాల ఎంబసీల కేంద్రంగా చైనా సాగించిన కుట్ర బయటపడింది. తన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల ద్వారా విదేశాల కాన్సులేట్లు మరియు కరోనా వ్యాక్సిన్ తయారీదారు “ఫైజర్”సహా ప్రముఖ మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల్లోకి చైనా అక్రమంగా చొర‌బ‌డినట్లు తేలింది.అమెరికా,బ్రిటన్ లలో ప్రముఖ సంస్థల్లో సీపీపీ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా, అమెరికా యూనివ‌ర్సిటీల‌లోనూ పెద్ద సంఖ్యలో సీపీపీ సభ్యులు ఉన్న‌ట్లు తేలింది.