Taiwan స్వతంత్రం రాజ్యంగా ఉన్న తైవాన్‌కు పొరుగునే ఉన్న చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. తైవాన్‌పై దాడి చేసి, ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. అయితే, ఈమధ్య కాలంలో ఈ ప్రయత్నాల్ని మరింత పెంచింది. ఇప్పటికే పలుసార్లు చైనా తన యుద్ధ విమానాల్ని తైవాన్ గగనతలంలోకి పంపింది.
China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా
ఆ దేశాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. చైనా-తైవాన్ సరిహద్దులో భారీ స్థాయిలో సైనికుల్ని, యుద్ధ సామగ్రిని మోహరించింది. తైవాన్‌పై చైనా ఎప్పుడైనా దాడి చేయొచ్చు. ఈ నేపథ్యంలో తైవాన్ అప్రమత్తమవుతోంది. చైనాను ఎదుర్కొనేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యంలో కనీసం ఏడాదిపాటు తప్పనిసరిగా పని చేసేలా చట్టం తేనుంది. గతంలో కూడా ఈ చట్టం అమలులో ఉండేది. అయితే, కొంతకాలం క్రితం దీన్ని నాలుగు నెలలకు తగ్గించారు. అంటే ప్రతి ఒక్కరూ సైన్యంలో కనీసం నాలుగు నెలలు పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయం చాలా తక్కువని అక్కడ చాలా మంది అంటున్నారు. పైగా చైనా నుంచి దాడి ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదిపాటు సైన్యంలో పని చేసేలా చట్టం రూపొందిస్తోంది.
China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా
ఇప్పటికే ఉన్న నాలుగు నెలల గడువును ఏడాదికి పెంచనుంది. 2024 నుంచి ఈ నిబంధనను అమలు చేయనుంది తైవాన్. ఒకప్పుడు తైవాన్.. చైనాలో భాగంగా ఉండేది. 1949 చైనా సివిల్ వార్ సందర్భంగా, ఆ దేశం నుంచి విడిపోయి స్వతంత్రంగా ఉంటోంది. కానీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా తైవాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నాడు. చైనా తైవాన్‌ను తనలో కలిపేసుకోవాలి అనుకుంటుంటే.. తైవాన్ దీనికి నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే అవసరమైతే సైనిక చర్య ద్వారా అయినా సరే తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలని జిన్ పింగ్ భావిస్తున్నాడు.