China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా

చైనా పర్యటనకు వచ్చే విదేశీయులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసింది. వచ్చే జనవరి 8 నుంచి క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. అలాగే విదేశీ ప్రయాణికుల రాకపై ఆంక్షలు కూడా ఎత్తివేసింది.

China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా

China Covid: ఒకపక్క దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుంటే, మరోపక్క చైనా విచిత్రమైన రూల్స్ పాటిస్తోంది. చైనా పర్యటనకు వచ్చే విదేశీయులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసింది. వచ్చే జనవరి 8 నుంచి క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. అలాగే విదేశీ ప్రయాణికుల రాకపై ఆంక్షలు కూడా ఎత్తివేసింది.

Covid Mock Drill: నేడు ఆస్పత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్.. కోవిడ్ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్య

చైనా అక్కడ కోవిడ్ నియంత్రణ కోసం ఇటీవలి కాలం వరకు కేటగిరి-ఏ నిబంధనలు అమలు చేసేది. కొద్ది రోజులుగా కేటగిరి-బి అమలు చేస్తోంది. కోవిడ్ తీవ్రత తగ్గి, సాధారణ శ్వాస సంబంధిత సమస్యగా మారిందని, అందువల్లే కోవిడ్ రూల్స్ ఎత్తివేస్తున్నామని చైనా ప్రకటించింది. మూడేళ్లక్రితం చైనాలో కోవిడ్ ప్రారంభమైన సమయంలో కఠిన నిబంధనలు అమలు చేసింది ప్రభుత్వం. తరచూ లాక్‌డౌన్ విధించడం, విదేశీ పర్యాటకులపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తీసుకుంది. దీంతో ఈ మూడేళ్లలో చైనా ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇదే సమయంలో చైనాలో కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఈ నేపథ్యంలో చైనా కోవిడ్ ఆంక్షల్ని ఇటీవల ఎత్తివేసింది. దీంతో చైనాలో అంచనాలకు అందని స్థాయిలో కోవిడ్ విజృంభిస్తోంది. కోట్ల సంఖ్యలో ప్రజలు కోవిడ్ బారిన పడుతున్నారు. రోజూ లక్షల్లో మరణిస్తున్నారు. అక్కడ అంత్యక్రియలకు కూడా గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.

Waltair Veerayya: వీరయ్య టైటిల్ సాంగ్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!

అయితే, అనేక కోవిడ్ ఆంక్షల్ని చైనా ఎత్తివేసినప్పటికీ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల విషయంలో మాత్రం ఆంక్షలు కొనసాగించింది. విదేశీ ప్రయాణికులు తప్పకుండా క్వారంటైన్ పాటించాల్సి ఉండేది. త్వరలో ఈ నిబంధనను కూడా ఎత్తివేయాలని తాజాగా నిర్ణయించింది. అంటే ఇకపై జనవరి 8 నుంచి చైనా వచ్చే విదేశీయులు క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదు. అయితే, చైనా రావడానికి 48 గంటల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని ఉండాలి.