Covid Mock Drill: నేడు ఆస్పత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్.. కోవిడ్ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్య

మంగళవారం దేశంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేంద్ర కుటుంబ, సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. కేంద్రం, రాష్ట్రాలు కూడా ఈ మాక్ డ్రిల్‌లో భాగస్వామ్యం అవుతాయి.

Covid Mock Drill: నేడు ఆస్పత్రుల్లో కోవిడ్ మాక్ డ్రిల్స్.. కోవిడ్ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్య

Covid Mock Drill: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత్ కూడా అప్రమత్తమవుతోంది. ఎలాంటి అత్యవసర స్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ దిశగా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా మంగళవారం దేశంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

Waltair Veerayya: వీరయ్య టైటిల్ సాంగ్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!

కేంద్ర కుటుంబ, సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. కేంద్రం, రాష్ట్రాలు కూడా ఈ మాక్ డ్రిల్‌లో భాగస్వామ్యం అవుతాయి. ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా ఆరోగ్య శాఖ మంత్రులు కూడా తమ స్థాయిలో కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షిస్తారు. దీని ద్వారా కోవిడ్ విజృంభించినప్పుడు ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ఒక అవగాహనకు రావొచ్చు. ఈ డ్రిల్ ద్వారా ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్స్, ఐసోలేషన్ బెడ్స్, ఆక్సిజన్ లభ్యత, వెంటిలేటర్ సపోర్టెడ్ బెడ్స్, డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆస్పత్రుల సంఖ్య, అంబులెన్స్‌లు, రవాణా వంటివి ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నాయో తెలుస్తుంది.

Tirumala Alert : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం

అలాగే బేసిక్ లైఫ్ సపోర్టెడ్ అంబులెన్సెస్, టెస్టింగ్ ఎక్విప్‌మెంట్, అవసరమైన మందులు, వెంటిలేటరీ మేనేజ్‌మెంట్ ప్రొటోకాల్ వంటి విషయాల్లో కూడా స్పష్టత వస్తుంది. రాష్ట్రాలతోపాటు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ మాక్ డ్రిల్స్ జరుగుతాయి. మరోవైపు కోవిడ్ నియంత్రణలో అప్రమత్తంగా ఉండాలని, అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ప్రస్తుతం చైనాలో కోవిడ్ ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ పాతిక కోట్ల మంది వరకు కోవిడ్ బారిన పడి ఉంటారని అంచనా. అయితే, ఆ లెక్కల్ని ప్రభుత్వం వెల్లడించడం ఆపేసింది.