Talibans
Taliban clarity on the kidnapping of 150 Indians : భారతీయులు ఎవరూ తమ వద్ద బంధీలుగా లేరని తాలిబన్ల అధికార సంస్థ ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది. తాలిబన్లు ఎటువంటి విదేశీయులను కిడ్నాప్ చేయలేదని, ప్రశ్నించడం చేయలేదని ప్రకటించింది. విదేశీయులు దేశం నుంచి వెళ్లిపోయే సమయంలో.. కేవలం ప్రశ్నిస్తున్నామని రాయిటర్స్‌కు తాలిబన్‌ల అధికార ప్రతినిధి తెలిపారు. తాలిబన్లు ప్రస్తుతం సంయమనం పాటిస్తున్నారని.. ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని తెలిపారు. ఆ ప్రకటనలో 150 మంది భారతీయుల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.
72 మంది అఫ్ఘాన్ సిక్కులు, హిందువులు.. భారతదేశానికి వెళ్లకుండా అడ్డుకున్నట్టు తాలిబన్ ప్రతినిధి తెలిపాడు. భారత వైమానిక దళానికి చెందిన IAF C-130J విమానంలో 150 మంది ఇండియాకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిలో ఆఫ్ఘాన్ సిక్కులు, హిందువులు ఉన్నారని.. వాళ్లని తాలిబన్లు అడ్డుకున్నట్టు ప్రకటించారు. మిగిలిన 85మంది భారతీయులు విమానంలో పంపించేశామని తాలిబన్లు తెలిపారు. ఆ విమానం ప్రస్తుతం తజికిస్థాన్‌లోని దుషన్‌బేలో ఇందనం నింపుకుందని కూడా తాలిబన్లు ప్రకటించారు.
ఆఫ్ఘానిస్థాన్‌లో కిడ్నాపైన భారతీయ పౌరులతో సహా మొత్తం 150 మంది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు సురక్షితంగా చేరుకున్నారు. ఆఫ్ఘన్ మీడియా ప్రకారం, సదరు వ్యక్తుల పాస్‌పోర్ట్‌లను తనిఖీ చేసిన తర్వాత తాలిబాన్లు వారిని విడిచిపెట్టారు. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెళ్లువెత్తడంతో వారిని వెంటనే కాబుల్ ఎయిర్‌పోర్టుకు తరలించినట్టు తెలుస్తోంది.
అంతకుముందు కిడ్నాప్ చేసిన వారందరినీ.. ఆల్‌కొజై గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన ఆఫీసుల్లో నిర్భందించారు తాలిబన్ టెర్రరిస్టులు. వారివద్ద నుంచి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. భారతీయులతో పాటు మరికొందరు విదేశీయులను తాలిబన్‌లు కిడ్నాప్ చేశారనే సమాచారంతో అన్ని దేశాల బలగాలు అప్రమత్తం అయ్యాయి.
అమెరికా సైనిక బలగాలు తాలిబన్ల కోసం వేటను ప్రారంభించగా.. అమెరికా బలగాలతో పాటు అఫ్ఘాన్ సైనికులు తమకోసం వేటాడుతున్నాయన్న ఇన్‌ఫర్మేషన్ తెలుసుకోగానే తాలిబన్‌లు భయపడ్డారు. వెంటనే తామెవరినీ కిడ్నాప్ చేయలేదని, అందరినీ కాబుల్ ఎయిర్‌పోర్టుకు తరలిస్తున్నట్టుగా అధికార ప్రతినిధులతో ప్రకటన చేయించారు.