Afghanistan : తాలిబన్లపై ధిక్కార స్వరం..నిరసనకారులపై కాల్పులు

తాలిబన్ సంస్థ అఫ్గానస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో వారి గత పాలనను దృష్టిలో ఉంచుకొని ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో అఫ్గాన్ పౌరులు

Afghanistan : తాలిబన్లపై ధిక్కార స్వరం..నిరసనకారులపై కాల్పులు

Jalalabad

Updated On : August 18, 2021 / 5:25 PM IST

Afghanistan తాలిబన్ సంస్థ అఫ్గానస్తాన్ ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో వారి గత పాలనను దృష్టిలో ఉంచుకొని ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో అఫ్గాన్ పౌరులు ఆందోళనలకు దిగారు. జలాలాబాద్​ నగర వాసులు పెద్ద సంఖ్యలో అఫ్గాన్ జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని ర్యాలీగా వెళ్లారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై అప్ఘాన్ జాతీయ జెండా ఉంచాలని డిమాండ్ చేస్తూ..నగరంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంపై ఉన్న తాలిబన్ జెండాను తొలగించి దాని స్థానంలో అప్ఘానిస్తాన్ జాతీయ జెండాను ఉంచారు. అయితే ఇది జరిగిన నిమిషాల వ్యవధిలో అఫ్గానిస్థాన్ జాతీయ జెండాతో నిరసనకు దిగిన పౌరులపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 12మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. తెలుస్తోంది.

మరోవైపు, తమ హక్కులను కాపాడాలంటూ మహిళలు పోరాటానికి దిగారు. రాజధాని కాబుల్​లో తాలిబన్లకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పలువరు మహిళలు నిరసన చేపట్టారు.