Pakistan Terrorists : 100మంది పాక్ ఉగ్రవాదులు విడుదల, తాలిబన్ల అరాచకం

అనుకున్నదే అయ్యింది. అంతా భయపడ్డటే జరుగుతోంది. అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకం షురూ అయింది. తాము ఎవరికీ హాని తలపెట్టబోమని ఇటీవల ప్రకటించిన తాలిబన్లు

Pakistan Terrorists : 100మంది పాక్ ఉగ్రవాదులు విడుదల, తాలిబన్ల అరాచకం

Pakistan Terrorists

Updated On : August 21, 2021 / 5:48 PM IST

Pakistan Terrorists : అనుకున్నదే అయ్యింది. అంతా భయపడ్డటే జరుగుతోంది. అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకం షురూ అయింది. తాము ఎవరికీ హాని తలపెట్టబోమని ఇటీవల ప్రకటించిన తాలిబన్లు క్రమంగా ముసుగు తొలగిస్తున్నారు. పలుచోట్ల హింసకు తెగబడుతున్నారు. అంతేకాదు జైళ్లలో ఉన్న నేరగాళ్లు, ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పిస్తున్నారు.

తాజాగా, అఫ్ఘాన్ జైళ్లలో ఉన్న 100 మంది పాకిస్తానీ ఉగ్రవాదులను తాలిబన్లు విడుదల చేశారు. విడుదలైన వారిలో తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రవాద సంస్థకు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు కూడా ఉన్నారు. రిలీజ్ అయిన వారిలో టీటీపీ మాజీ డిప్యూటీ చీఫ్ మౌల్వీ ఫకిర్ మొహ్మద్ వంటి అగ్ర నేతలు ఉన్నట్టు మీడియా నివేదికలు వెల్లడించాయి. వీరితోపాటు అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను కూడా జైలు నుంచి విడుదల చేసినట్టు తెలిపాయి. ఈ ఉగ్రవాదులు జైళ్ల నుంచి విడుదలైన కొన్ని గంటల్లోనే తిరిగి ఉగ్రవాద సంస్థలో చేరారు.

అల్ ఖైదా నుంచి తెహ్రిక్ ఇ తాలిబన్‌‌కు సైద్ధాంతిక మార్గదర్శనం కొనసాగుతోంది. తెహ్రిక్ ఇ తాలిబన్‌‌ అంటే పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే, పాక్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చడమే టీటీపీ లక్ష్యం. ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్థాన్‌లో పలుసార్లు విధ్వంసాలకు పాల్పడింది. పాకిస్థాన్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టడం.. అల్-ఖైదా నుంచి సైద్ధాంతిక మార్గదర్శకత్వం పొందడమే లక్ష్యంగా ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. అఫ్ఘాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలకు చెందినవారిని ఈ సంస్థ రిక్రూట్ చేసుకుంటోంది.

అమెరికా, మిత్రరాజ్యాల సైన్యం అఫ్ఘానిస్తాన్ నుంచి వైదొలగిన తర్వాత.. తాలిబన్ మూకలు రెచ్చిపోయాయి. పది రోజుల్లో యావత్తు దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. వచ్చీ రాగానే తాలిబన్ల అరాచకం మొదలైంది. అఫ్ఘాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టడంతో మధ్య ఆసియాలోని పలు వేర్పాటువాద, ఉగ్రవాద సంస్థలకు నైతికంగా బలాన్ని చేకూర్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల కొత్త కూటమికి దారితీసి ఉగ్రదాడులు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లోని ఐఎస్, అల్‌ఖైదా సహా ఇతర చిన్న చిన్న ఉగ్రవాద సంస్థలు బలపడతాయని భయపడుతున్నారు. ఐఎస్ఐఎస్, తాలిబన్, అల్‌ఖైదాలు ఒకరికొకరు శత్రువులు.. కానీ, కొత్త తరం తమ విబేధాలను పక్కనబెట్టి ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పనిచేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.