Rohullah Saleh : అప్ఘాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లా సోదరుడిని హింసించి కాల్చిచంపిన తాలిబన్లు

కాబుల్ విడిచి పంజ్ షీర్ వెళ్లిన అఫ్ఘానిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్‌‌ను తాలిబన్లు హింసించి హతమార్చినట్లు సమాచారం.

Rohullah Saleh : అప్ఘాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లా సోదరుడిని హింసించి కాల్చిచంపిన తాలిబన్లు

Taliban Torture And Kill Brother Of Former Afghan Vp Amrullah Saleh Report

Updated On : September 10, 2021 / 10:24 PM IST

అప్ఘానిస్తాన్ హస్తగతం చేసుకున్న అనంతరం పంజ్ షీర్ లోయలోకి అడుగుపెట్టిన తాలిబన్లు నరమేధం సృష్టిస్తున్నట్లు నివేదకలు చెబుతున్నాయి. పంజ్‌షీర్ కూడా తమ నియంత్రణలోకి తీసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఇప్పుడు అక్కడ ఇంటింటికి వెళ్లి తమకు వ్యతిరేకంగా పోరాడే వారి కోసం తనిఖీలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. తాలిబన్ల వ్యతిరేకులను, మైనార్టీలను పట్టుకుని హింసించి మరి చంపేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబుల్ విడిచి పంజ్ షీర్ వెళ్లిన అఫ్ఘానిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్‌‌ను కూడా తాలిబన్లు హతమార్చినట్లు సమాచారం.

పంజ్‌షీర్ లోయలో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్న రోహుల్లా సలేహ్‌ను తాలిబాన్లు హింసించి కాల్చిచంపినట్టు పలు నివేదికలు వెల్లడించాయి. ఆగస్టు 15న తాలిబన్లు కాబుల్ ఆక్రమించుకోవడంతో రెసిస్టెన్స్ ఫోర్సెస్ నేత అహ్మద్ మసూద్‌తో కలిసి అమ్రుల్లా సలేహ్ పంజ్ షేర్ లోయకు వెళ్లిపోయారు. అక్కడే అప్ఘాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఆయన ప్రకటించుకున్నారు. ప్రస్తుతం పంజ్‌షీర్‌లో ఉన్న అమ్రుల్లా సలేహ్ అన్నయ్య రోహుల్లా సలేహ్‌ను గుర్తించిన తాలిబన్లు కిరాతకంగా హత్య చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. అమ్రుల్లా ఇంట్లోకి చొరబడిన తాలిబన్లు రోహుల్లాను కాల్చి చంపినట్లు సమాచారం.
9/11 Terror Attack : 20ఏళ్ల తర్వాత.. ఎప్పటికీ మర్చిపోలేని 9/11 దాడుల భయానక దృశ్యాలు!

సోషల్ మీడియాలో తాలిబాన్ ఫైటర్‌ని చూపించిన ఫోటోలు అమృల్లా ముందు నుంచి వీడియోను రికార్డ్ చేశాయి. రోఖా జిల్లాలో గురువారం రాత్రి రోహుల్లాను కాల్చి చంపినట్లు ఓ నివేదిక వెల్లడించింది. పంజ్‌షీర్ లోయలో ఇప్పటికీ పోరాటాలు కొనసాగుతున్నాయని, పర్వతాలలో పోరాటయోధులు పోరాడుతున్నారని రేడియో ఫ్రీ యూరోప్ నివేదించింది. పోరాట యోధులు తమ జెండాను ఎగురవేసిన ఫోటోలను విడుదల చేశారు. కమాండర్ రిజిస్తానీ నేతృత్వంలోని ప్రతిఘటన సభ్యులు యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందని పేర్కొంటూ వీడియోను విడుదల చేశారు.
9/11 Terror Attack : 9/11ఘటనకి 20ఏళ్ళు అవుతున్నా..ఇంకా కొనసాగుతున్న అవశేషాల గుర్తింపు