9/11 Terror Attack : 20ఏళ్ల తర్వాత.. ఎప్పటికీ మర్చిపోలేని 9/11 దాడుల భయానక దృశ్యాలు!

అదో భయానక ఘటన.. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. 20 సంవత్సరాల క్రితం.. సెప్టెంబర్ 11, 2001న 9/11 దాడుల నాటి ఘటన ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంది.

9/11 Terror Attack : 20ఏళ్ల తర్వాత.. ఎప్పటికీ మర్చిపోలేని 9/11 దాడుల భయానక దృశ్యాలు!

రెండో టవర్, సెప్టెంబర్ 11, 2001 నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. శిధిలాల్లో నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్‌లలోని ఒకదాని నుంచి పొగలు కమ్ముకున్నాయి.

September 11 Terror Attacks : అదో భయానక ఘటన.. తలచుకుంటే ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం.. ఉగ్రవాదులు హైజాక్ చేసిన విమానాలు.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, వాషింగ్టన్, డిసిలోని పెంటగాన్, పెన్సిల్వేనియాలోని శాంక్‌విల్లేలో ట్విన్ టవర్లలోకి దూసుకెళ్లాయి. సెప్టెంబర్ 11, 2001న జరిగిన ఈ ఉగ్రదాడుల ఘటన ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంది. అమెరికాలోని న్యూయార్క్ ట్విన్‌ టవర్స్(వరల్డ్ ట్రేడ్ సెంటర్)పై 9/11 ఉగ్రదాడి జరిగి శనివారం (సెప్టెంబర్-11,2021)నాటికి 20 ఏళ్లు పూర్తవుతుంది. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్-ఖైదాకు చెందిన 19 మంది హైజాకర్లతో సహా దాదాపు 3వేల మంది ఈ ఉగ్రదాడుల్లో మరణించారు. 9/11 ఆ దాడుల నాటి కొన్ని చిరస్మరణీయ ఫొటోలు మీకోసం అందిస్తున్నాం..

అమెరికా గడ్డపై అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా చరిత్రలో నిలిచింది. శిథిలావస్థలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లలో చిక్కుకున్నవారి ప్రాణాలను కాపాడేందుకు వెళ్లిన 343 అగ్నిమాపక సిబ్బందిని కూడా న్యూయార్క్ అగ్నిమాపక శాఖ కోల్పోయింది. 9/11 ఉగ్రదాడుల నేపథ్యంలో అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్‌.. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ తాలిబాన్ ఆశ్రయం కల్పించిన అల్-ఖైదా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అఫ్ఘానిస్తాన్‌కు అమెరికా సైనికులను మోహరించారు. ఆ తర్వాత జరిగిన 20 సంవత్సరాల యుద్ధం ఆగస్ట్ 31న ముగిసింది. ఇప్పటి బైడెన్ పరిపాలనలో అప్ఘాన్ లో అమెరికా మొత్తం సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది.