Thailand Gambling Case: థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌తో సహా 93మంది అరెస్ట్ ..
థాయ్ లాండ్ లో గాంబ్లింగ్ దందా..క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ అడ్డంగా బుక్ అయ్యాడు. 93మందిని థాయ్ పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో తెలంగాణకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు.

Thailand Gambling : తెలంగాణకు చెందిన క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ నివాసాలపై ఈడీ దాడులు గత ఏడాది పెను సంచలన కలిగించాయి. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించినట్లుగా గుర్తించారు అధికారులు. అయినా చికోటీ ప్రవీణ్ దందాలుకొనసాగుతునే ఉన్నాయి. అవును నేను క్యాసినో నిర్వహిస్తాను అంటూ బహిరంగానేచెప్పిన చికోటీ బాగోతాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, థాయ్ ల్యాండ్ లో క్యాసినో నిర్వహించినట్లుగా అధికారులు తేల్చారు.
చికోటీ కష్టమర్లలో ఏపీ తెలంగాణకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఉన్నట్లుగాను తేలింది. కానీ చికోటి క్యాసినో దందాలను మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. తాజాగా థాయ్ లాండ్ లో గాంబ్లింగ్ నిర్వహిస్తున్న చికోటీ ప్రవీణ్ అడ్డంగా థాయ్ పోలీసులకు చిక్కాడు. థాయ్ లాండ్ ఇంటిలిజెన్స్ కు గోవాకు చెందిన ఓ వ్యక్తి సమాచారం ఇవ్వటంతో దాడులు నిర్వహించిన థాయ్ పోలీసులు చికోటీ ప్రవీణ్ తో పాటు 93మందిని థాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాసినో రంగంలో గ్యాంబ్లింగ్ కింగ్ గా గుర్తింపు పొందిన చికోటి ప్రవీణ్ థాయ్ లాండ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇంకా అరెస్ట్ అయినవారిలో తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఇసుక వ్యాపారి సాగర్, వ్యాపారవేత్తలు సుదర్శన్ రెడ్డి,భరత్ రెడ్డి,మల్లికార్జున్ రావు, బిల్డర్ మధు, మాధవరెడ్డి, వర్మ, తిరుమల రావు,బొమ్మిడి మధుసూధన్ రావులతో పాటు పలువురు ఉన్నారు.
పట్టాయాలోని ఓ హోటల్ లో రూ.100 కోట్లకు పైగా గ్యాంబ్లింగ్ జరుగుతోందన్న పక్కా సమాచారంతో థాయ్ లాండ్ పోలీసులు దాడులు చేయగా 93మందిని అరెస్ట్ చేశారు. చికోటి ప్రవీణ్ థాయ్ మహిళలతో కలిసి గ్యాంబ్లింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసినట్లుగా థాయ్ పోలీసులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ, హైదరాబాద్ నుంచి, దేశంలోని పలు ఇతర ప్రాంతాల నుంచి గ్యాంబ్లింగ్ పై ఆసక్తి ఉన్నవాళ్లను థాయ్ లాండ్ తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ గాంబ్లింగ్ గ్యాంగ్ లో మంచిగా ఎంజాయ్ చేస్తున్న చికోటి కష్టమర్లు మరికొన్ని గంటల్లో భారత్ తిరిగి వచ్చేద్దామనగా థాయ్ పోలీసులు చేసిన మెరుపుదాడిలో అడ్డంగా బుక్ అయిపోయారు. పోలీసులు ఈ దాడుల్లో రూ.21 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గాంబ్లింగ్ నిర్వహణలు మహిళల పాత్ర ఉన్నట్లుగా థాయ్ పోలీసులు గుర్తించారు. విచారణను వేగవంతం చేశారు.