Thailand scientists socks Stink : బూట్లు తీసేసి సాక్సులు వచ్చే కంపును అస్సలు భరించలేం. ఠక్కున ముక్కు మూసేసుకుంటాం. కడుపులో తిప్పేసే ఆ వాసన భరించనేలేం. కానీ ఇకపై సాక్సులు దుర్వాసన రాకుండా ఉండటానికి థాయిలాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు కొత్త రకం రసాయనాలను కనిపెట్టారు. ఈ కెమికల్స్ సాక్స్‌లోని బ్యాక్టీరియా, వాసనను రాకుండా చేస్తుంది.
సాక్స్‌లో జింక్ ఆక్సైడ్ నానో కణాలను ఉపయోగించారు. ఆ కణాలు సాక్సుల నుంచి వచ్చే దుర్వాసనలు రాకుండా పాదాలలో ఉండే బ్యాక్టీరియాను చంపాయి. తమ పరిశోధనలు విజయవంతమయ్యాయని థాయిలాండ్‌లోని మహిడోల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఇకపై సాక్సులు దుర్వాసన రాకుండా ఉండటానికి అతిత్వరలో ఈ రసాయనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
పాదాల వాసనను బ్రోమోడోసిస్ అని.. పాదాలలో సంక్రమణను పిట్ కెరాటోలిసిస్ అంటారు. జింక్ ఆక్సైడ్ యొక్క నానో కణాలు ఈ రెండింటినీ అధిగమిస్తాయి. జింక్ ఆక్సైడ్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. అంతేకాదు…ఈ రసాయనం చర్మానికి ఎటువంటి హాని చేయదు.
బట్టలు, సాక్స్లపై పొరను సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ రసాయినాలను ఉపయోగించవచ్చునని సైంటిస్టులు చెప్పారు. పాదాల నుంచి దుర్వాసనలు వచ్చే వ్యక్తులపై తాము పరిశోధనలు చేశామని..చివరకు జింక్ ఆక్సైడ్ నానో కణాలను ఉపయోగించి వాసనలతోపాలటు బ్యాక్టీరియాను తొలగించి వారి పాదాలు..సాక్సులు దుర్వాసన రాకుండా చేశామని పరిశోధకుడు డాక్టర్ పుణ్యావి ఓంగ్స్రి తెలిపారు.
నేవీ క్యాడెట్ల కాళ్లలో సంక్రమణ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని 2018 లో నిర్వహించిన పరిశోధనలో తేలింది. అటువంటి కేసులను తగ్గించడానికి పరిశోధనలు విజయవంతంగా పూర్తిచేశారు. తద్వారా పాదాల నుంచి బ్యాక్టీరియా, వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఈ పద్ధతి ఆర్మీ సైనికులకు చాలా ఉపశమనం కలిగిస్తుందని పుణ్యావి ఓంగ్సి తెలిపారు. బట్టల ద్వారా మనుషులకు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి వస్త్ర పరిశ్రమల కోసం కూడా పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.