మహిళ తలరాతను మార్చేసిన నత్త : కూర వండటానికి తెస్తే కోటీశ్వరురాలిని చేసింది

కూర వండటానికి ఓ నత్తను తీసుకొస్తే ఆ నత్త కాస్తా ఆమె తలరాతను మార్చేసింది. కూర వండటానికి నత్తల్ని కొనుక్కొచ్చి.. శుభ్రం చేసి కట్‌ చేస్తుండగా.. ఓ నత్తలోపల ఆమెకు ఆరెంజ్‌ కలర్‌లో ఉన్న రాయి లాంటిది కనిపించింది. నత్త కడుపులో దొరికిన ఆ పదార్థం ఆరు గ్రాముల బరువున్న 1.5 సెంటిమీటర్ల వ్యాసార్థం గల అరుదైన మేలు జాతికి చెందిన మెలో జాతికి చెందిన ముత్యం..!! క్వాలిటీని బట్టి మత్యాల రేటు ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ అరుదైన ఆరెంజ్ కలర్ లో ఉన్న ఈ ముత్యం కోట్ల రూపాయల ఖరీదు ఉంటుంది.

మహిళ తలరాతను మార్చేసిన నత్త : కూర వండటానికి తెస్తే కోటీశ్వరురాలిని చేసింది

Thailand Woman Finds Orange Melo Pearl Worth Crores Rupees

Updated On : March 27, 2021 / 12:40 PM IST

thailand woman finds orange melo pearl worth crores rupees : అదృష్ట వంతుడ్ని చెడగొట్టేవాడు ఎవ్వరూ ఉండరని ఓ సామెత. అటువంటి అదృష్టాన్ని చేజిక్కించుకుందో మహిళ. కూర వండటానికి ఓ నత్తను తీసుకొస్తే ఆ నత్త కాస్తా ఆమె తలరాతను మార్చేసింది. తనను కోసి కూర వండేద్దామనుకున్న మహిళను ఆ నత్త కోట్లకు అధిపతిని చేసింది. కేవలం 160 రూపాయల ఖర్చు పెట్టి నత్తలను కొనిక్కొచ్చిన మహిళ ఇంటికి తీసుకొచ్చి దాన్ని కోసింది. అంతే షాక్ అయ్యింది. ఆ నత్తలో ఉన్న ఓ అమూల్యమైన ముత్యం తనను కోటీశ్వరురాలిని చేస్తుందని తెలిసి షాక్ అయ్యింది. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోయిందామె. మరి ఆ కోటీశ్వరురాలి అదృష్టం గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

1

 

థాయ్‌ ల్యాండ్ లో కొడ్చకార్న్ తాంతివిట్కుల్ అనే మహిళ రెండు నెలల క్రితం రాత్రి భోజనంలోకి కూర వండుదామని చూస్తే ఇంట్లో కూరగాయలు లేవు. దీంతో కూరగాయలకు బదులు ఇవాళ నాన్ వెజ్ తిందామని అనుకుంది. అనుకున్నదే తడవుగా సమీపంలోని చేపల మార్కెట్‌ కు వెళ్లింది. అక్కడ 163 రూపాయలు పెట్టి నత్తలను కొన్నది. వాటిని తీసుకుని ఇంటికి వచ్చేసింది.

2

వాటిని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి కట్‌ చేస్తుండగా.. ఓ నత్తలోపల ఆమెకు ఆరెంజ్‌ కలర్‌లో ఉన్న రాయి లాంటిది కనిపించింది. దాన్ని చేతులోకి తీసుకుని శుభ్రంగా కడిగి చూసి షాక్‌ అయ్యింది. గబగబా దాన్ని పట్టుకెళ్లి తల్లికి చూపించింది.తల్లి చెప్పిన విషయం విని కొడ్చకార్న్‌ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఇది ఏదో రాయి కాదే అపురూపమైన ముత్యం అని తల్లి చెప్పేసరికి తెగ ఆనందపడిపోయింది. ఇక తమ దరిద్రం తీరిపోతుందని తెగ ఆనందపడిపోయింది.

13

నత్త కడుపులో దొరికిన ఆ పదార్థం ఆరు గ్రాముల బరువున్న 1.5 సెంటిమీటర్ల వ్యాసార్థం గల అరుదైన మేలు జాతికి చెందిన మెలో జాతికి చెందిన ముత్యం..!! క్వాలిటీని బట్టి మత్యాల రేటు ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ అరుదైన ఆరెంజ్ కలర్ లో ఉన్న ఈ ముత్యం కోట్ల రూపాయల ఖరీదు ఉంటుంది.

4

తనకు దొరికిన ముత్యం గురించి సంబరపడిపోతూ..కొడ్చకార్న్‌ మాట్లాడుతూ.. ‘‘నత్తలు శుభ్రం చేస్తుండగా దొరికిన వస్తువును మా అమ్మకు చూపించాను. ఆమె దాన్ని పరీక్షగా చూసి.. ఇది మెలో ముత్యం అని అమ్మ చెప్పింది.. ఇది కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందని అమ్మ చెప్పింది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దీనికి మంచి రేటు వస్తే మా కష్టాలు తీరిపోతాయి అంటే ఉద్వేగంగా చెప్పింది.

6

 

ప్రస్తుతం దీ​న్ని కొనే వారి కోసం చూస్తున్నాను. వచ్చే డబ్బుతో క్యాన్సర్ తో బాధపడుతున్న మా అమ్మకు మంచి వైద్యం చేయించాలని చెప్పింది. అమ్మ వైద్యం కోసం 23.34 లక్షల రూపాయలు అవసరం అవుతాయని డాక్టర్లు చెప్పారనీ..కానీ తమకు అంత స్తోమత లేక సాధారణ వైద్యం చేయిస్తున్నాం. కానీ ఈ ముత్యం అమ్మితే మంచి డబ్బు వస్తే ముందుగా అమ్మకు మంచి వైద్యం చేయింలని కన్నీళ్లతో చెప్పింది కొడ్చకార్న్‌.