Titan submersible: మునిగిన టైటానిక్ సబ్‌మెర్సిబుల్‌ను వెలికితీయడంలో సవాళ్లెన్నో

సముద్రంలో మునిగిన సబ్ మెర్సిబుల్ నౌకను బయటకు తీసుకురావడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.గల్లంతైన నౌకలో ఉన్న ఆక్సిజన్ సరఫరా గురువారం తెల్లవారుజామున అయిపోతుందని ఈ టూర్‌ను నిర్వహించిన ప్రైవేట్ కంపెనీ ఓషన్‌గేట్ తెలిపింది. ఈ నౌక సముద్ర అడుగుభాగంలో ఉంటే దీన్ని రక్షించడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు....

Titan submersible: మునిగిన టైటానిక్ సబ్‌మెర్సిబుల్‌ను వెలికితీయడంలో సవాళ్లెన్నో

సముద్రంలో మునిగిన టైటానిక్ సబ్ మెర్సిబుల్ వెలికితీతలో సవాళ్లెన్నో

Updated On : June 23, 2023 / 2:22 PM IST

Titan submersible: అట్లాంటిక్ మహా సముద్రంలో 111 ఏళ్ల క్రితం మునిగిన టైటానిక్ శిథిలాలను వీక్షించేందుకు సముద్ర గర్భంలోకి పర్యాటకులను తీసుకెళ్తున్న సబ్‌మెర్సిబుల్ ఓడ ఆదివారం నుంచి కనిపించకుండా పోయింది. ఈ ఓడలో ఒక పైలట్, నలుగురు ప్రయాణికులు ఉన్నారు. మునిగిన నౌకలో బ్రిటన్ దేశానికి చెందిన సాహసయాత్రికుడు హమీష్ హార్డింగ్, పాక్ బిలియనీర్ షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ మరో ఇద్దరు పర్యాటకులున్నారు. పర్యాటకులతో సముద్ర గర్భంలో లేదా ఉపరితలంపై సబ్ మెర్సిబుల్ ఓడ జాడ కోసం కెనడా, అమెరికా దేశాల రక్షణ, కోస్ట్ గార్డ్ సిబ్బంది శోధిస్తున్నారు. మునిగిన నౌకను బయటకు తీసుకురావడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. (challenges of recovering the Titan submersible)

నాడు సముద్రంలో  మునిగిన టైటానిక్ నౌక… నేడు సబ్ మెర్సిబుల్ ఓడ

ఓషన్ గేట్ అనే సంస్థ నిర్వహిస్తున్న ఈ సాహసయాత్రలో టైటానిక్ శకలాల సందర్శన ప్రత్యేకమైంది.న్యూ ఫౌండ్ లాండ్ నుంచి మొదలైన యాత్ర 400 నాటికల్ మైళ్ల దూరంలోని టైటానిక్ శకలాల వద్దకు చేరాల్సి ఉండగా సెయింట్ జాన్స్ కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో ఈ జలంతర్గామితో సంబంధాలు తెగిపోయాయి. నాడు 1912వ సంవత్సరంలో మంచుకొండను ఢీకొని టైటానిక్ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగింది. వాటి శకలాలను చూసేందుకు 2.5 లక్షల డాలర్లు చెల్లించి పర్యాటకులను ఓషన్ గేట్ సంస్థ తీసుకువెళ్లింది. నాడు టైటానిక్ నౌక, నేడు సబ్ మెర్సిబుల్ ఓడ (Titan submersible)సముద్రంలో మునిగిపోయాయి.

మునిగిన నౌకలో ఆక్సిజన్ అయిపోతే… ఎలా? 

గల్లంతైన నౌకలో ఉన్న ఆక్సిజన్ సరఫరా గురువారం తెల్లవారుజామున అయిపోతుందని ఈ టూర్‌ను నిర్వహించిన ప్రైవేట్ కంపెనీ ఓషన్‌గేట్ తెలిపింది. ఈ నౌక సముద్ర అడుగుభాగంలో ఉంటే దీన్ని రక్షించడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. టైటానిక్ శిథిలాలు సముద్ర ఉపరితలం నుంచి రెండున్నర మైళ్ల అడుగులో ఉన్నాయి. సంబంధాలు కోల్పోయిన సబ్ మెర్సిబుల్ నౌక సముద్ర గర్భంలో నల్లగా గడ్డకట్టి ఉంది. సముద్ర గర్భంలో బురద మధ్య ఉన్న సబ్ మెర్సిబుల్ నౌక సరిగా కనిపించడం లేదని సముద్ర నిపుణుడు టిమ్ మాల్టిన్ చెప్పారు.

సబ్ మెర్సిబుల్ నౌకను వెలికితీయడం కష్టమే…

టైటానిక్ శిథిలాల లోతుకు చేరుకోగల సబ్ మెర్సిబుల్ ఓడలు ఉన్నాయి. కాని తప్పిపోయిన సబ్ మెర్సిబుల్ నౌకను సముద్ర ఉపరితలం వరకు లాగే శక్తి సబ్ మెర్సిబుల్ లకు లేదని బ్రిటన్ దేశంలోని కీలే యూనివర్శిటీ ఫోరెన్సిక్ జియో సైంటిస్ట్ జామీ ప్రింగిల్ చెప్పారు. మునిగిన సబ్ మెర్సిబుల్ నౌక సముద్రంలో పాక్షికంగా నీట మునిగి ఉన్నా దాన్ని గుర్తించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. ఈ నౌక మునిగిన ప్రాంతం సముద్రంలో చాలా దూరంగా ఉండటంతో దాన్ని శోధించడానికి పెద్ద నౌకలు వెలికితీసే సామాగ్రిని అక్కడికి తరలించడానికి సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు.