Ever Given : లైన్ క్లియర్.. సూయజ్ కాలువ నుంచి తిరిగి వెళ్తున్న ఎవర్ గివెన్ నౌక!

ఎవర్ గివెన్ భారీ నౌక.. మళ్లీ బయల్దేరింది. సూయజ్ కాలువ మార్గంలో మరోసారి వెళ్తోంది. కొన్ని నెలల క్రితం ఈ భారీ నౌక ఇదే మార్గంలో అడ్డంగా చిక్కుకుంది.

Ever Given to Crorss Suez Canal : ఎవర్ గివెన్ నౌక.. మళ్లీ బయల్దేరింది. సూయజ్ కాలువ మార్గంలో తిరిగి వెళ్తోంది.  నాలుగు నెలల క్రితం ఇదే మార్గంలో ఎవర్ గివెన్ భారీ నౌక అడ్డుగా చిక్కుకుపోయింది. దాంతో ఆ మార్గంలో వెళ్లే అనేక నౌకలు స్తంభించిపోయాయి. ఫలితంగా వేల కోట్ల నష్టానికి దారితీసింది. ఇప్పుడు అదే సూయజ్ కాలువ మార్గంలో ఎవర్ గివెన్ నౌక తిరిగి వెళ్తోంది. అంతకుముందు నష్టపరిహారం ఇవ్వకుంటే నౌకను విడుదల చేసేది లేదని సూయజ్ కెనాల్ అథారిటీ తేల్చేచెప్పేసింది.

దాంతో అప్పటి నుంచి అక్కడే నిలిచిపోయింది. ఆ తర్వాత నౌక జూలై 29న రోటర్‌డామ్ పోర్టుకు చేరుకుంది. ఇటీవలే ఈ నౌక విడుదలకు సంబంధించి నౌక యాజమాన్య సంస్థ, బీమా కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు సూయజ్ కెనాల్ అథారిటీ నౌకను తిరిగి వెళ్లేందుకు అనుమతించింది. ఈ నౌక అంతర్జాతీయ వాణిజ్య మార్గాన్ని వదిలి, రోటర్‌డామ్, నెదర్లాండ్స్ వైపు వెళ్లింది. పోర్టులో డెల్టా టెర్మినల్‌కి చేరుకున్నప్పుడు.. ఎవర్ గివెన్ నౌక ఈ పోర్టు ద్వారా స్థానిక దిగుమతులు, ట్రాన్స్‌షిప్‌మెంట్‌లను దించుతుందని ఆపరేటర్ కంపెనీ ఎవర్ గ్రీన్ లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
worm moon : సూయజ్ కాల్వ, ఎవర్ గివెన్ ఎలా కదిలింది..చందమామ సహాయం చేసిందా

ఈ ఏడాది మార్చిలో సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక అడ్డంగా చిక్కుకుపోయింది. ఆ మార్గంలో కొన్ని రోజులపాటు రవాణా ఆగిపోయింది. రోజుకు రూ.70 వేల కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా. వారంరోజుల పాటు శ్రమించిన అనంతరం ఈ నౌకను కాలువ నుంచి అడ్డు తప్పించారు. అప్పటినుంచి తిరిగి ప్రయాణానికి ఈ నౌకకు సూయజ్ కెనాల్ అథారిటీ అనుమతివ్వలేదు. జలరవాణా ఆగిపోవడంతో నష్టానికి పరిహారం చెల్లించాలంటూ సూయజ్ కెనాల్ అథారిటీ ఈజిప్టు కోర్టులో దావా వేసింది. 91.6 కోట్ల అమెరికన్ డాలర్ల పరిహారం చెల్లించాలని NCA కోరింది. ఆ తర్వాత నష్టపరిహారం మొత్తాన్ని 55 కోట్ల అమెరికన్ డాలర్లకు తగ్గించింది. ఈ నష్టాన్ని ఎవరూ భరించాలి అనేదానిపై నౌక యజమాన్య సంస్థ బీమా కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. ఎంత నష్ట పరిహారానికి ఒప్పందం కుదిరిందనే విషయంలో ఎస్సీఏ, నౌక యజమాన్య సంస్థ, బీమా సంస్థ అధికారికంగా ప్రకటించలేదు.
Suez Canal: ఎవర్‌గివెన్ నౌక.. సూయెజ్ కెనాల్ అథారిటీ డీల్‌ ఫిక్స్

ట్రెండింగ్ వార్తలు