World’s largest restaurant : కొండలో సగ భాగం రెస్టారెంటే… 5,800 మందికి ఒకే సారి సర్వీస్.. ఎక్కడంటే..

ప్రపంచంలోనే అతి పెద్ద రెస్టారెంట్ గురించి మీకు తెలుసా? అక్కడ 5,800 మందికి ఒకేసారి సర్వీస్ అందిస్తారు. ఎటొచ్చి మీరు అక్కడికి చేరుకోవడానికి, మీ టేబుల్ గుర్తించడానికి కాస్త టైం..ఓపిక మీకు ఉండాలి. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడ ఉందంటే.. చదవండి.

World’s largest restaurant : కొండలో సగ భాగం రెస్టారెంటే… 5,800 మందికి ఒకే సారి సర్వీస్.. ఎక్కడంటే..

World's largest restaurant

Updated On : May 14, 2023 / 2:30 PM IST

The largest restaurant in Chongqing : ఆ హోటల్ కి వెళ్లాలంటే చాలా తీరిక ఉండాలి. ముందు మీ కారు పార్క్ చేయాలంటేనే కనీసం అరగంట టైం పడుతుంది. మీ టేబుల్ ఎక్కడో తెలుసుకోవడానికి కూడా వెయిట్ చేయాలి. కాస్త టైం.. కొంచెం సహనం ఉంటే ప్రపంచంలోనే అద్భుతమైన హోటల్‌ని మీరు చూడగలరు. చైనాలోని ఆ రెస్టారెంట్ గురించి చదవండి.

Modi The Immortal : చైనాలో ప్రధాని మోదీని ఏమని పిలుస్తారో తెలుసా..? ఏకంగా ముద్దుపేరు పెట్టేశారు..

చైనాలోని చాంగ్‌కింగ్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద రెస్టారెంట్ ఉంది. ఇది కొండపై సగ భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. ఇక్కడ 900 టేబుల్స్, 5,800 మంది ఒకేసారి కూర్చునే తినే అవకాశం ఉంది. చాంక్‌కింగ్ శివార్లలోని నాన్ జిల్లాలో 3,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్‌లో టేబుల్ రిజర్వ్ చేసుకున్నాక దానికి గుర్తించడానికి కూడా టైం పడుతుంది.

 

చైనా చుట్టుపక్కల ప్రజలంతా ఈ హోటల్‌కి వస్తుంటారు. ఈ హోటల్‌లో మన వెహికల్ పార్క్ చేయడానికి దాదాపు 30 నిముషాల సమయం పడుతుంది. ప్రతి రోజు టన్నుల కొద్ది వంటకాలను ఇక్కడ భారీ సంఖ్యలో ఉండే కుక్‌లు వండుతుంటారు. వందలాది మంది వెయిటర్లు, కిచెన్ సిబ్బంది, క్యాషియర్లు సర్వీస్ అందిస్తుంటారు.

English Vinglish : శ్రీదేవి మళ్ళీ వస్తుంది.. అతిలోక సుందరి సినిమా చైనాలో రిలీజ్..

ఈ హోటల్ రాత్రి పూట కూడా ఫుల్ బిజీగా ఉంటుంది. చెప్పాలంటే పగటిపూట కంటే రాత్రివేళ చాలామంది పర్యాటకులు వస్తుంటారు. తేలికపాటి మసాలా దినుసులతో వండిన తాజా ఆహారం, మంచి సర్వీస్ ఇక్కడికి వచ్చే మనుష్యుల్ని అట్రాక్ట్ చేస్తాయి. గత ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో ఈ హోటలో స్ధానం దక్కించుకుందట.