బాంబులతో తలుపులు పేల్చేసి హెల్మెట్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఆ హెల్మెట్ గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..

నెదర్లాండ్స్ లోని డ్రెంట్స్ మ్యూజియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచిన హెల్మెంట్ ను దొంగల ముఠా ఎత్తుకెళ్లింది.

బాంబులతో తలుపులు పేల్చేసి హెల్మెట్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఆ హెల్మెట్ గురించి తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..

gold helmet

Updated On : January 28, 2025 / 1:10 PM IST

Golden Helmet: కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య మ్యూజియంలో ఉంచిన హెల్మెంట్ ను దొంగల ముఠా దోచుకెళ్లింది. మ్యూజియంలో భద్రపర్చగా.. బాంబులతో గది తలుపు పేల్చేసి మరీ ఆ హెల్మెంట్ ను దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటన నెదర్లాండ్స్ లో జరగ్గా.. ఆ ప్రభుత్వం ఈ చోరీ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే.. కేవలం ఒక హెల్మెంట్ కోసం ఇంత రాద్దాంతమా అని అనుకోకండి.. అది మామూలు హెల్మెంట్ కాదు.. బంగారంతో తయారు చేసింది. దానికి 2500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది.

Also Read: ఫిబ్రవరిలో అమెరికాకు ప్రధాని నరేంద్ర మోదీ..! స్వయంగా వెల్లడించిన డొనాల్డ్ ట్రంప్

ఈ హెల్మెంట్ ను రోమేనియాలో వంద సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంలో కనుగొన్నారు. ‘హెల్మెంట్ ఆఫ్ కోటోఫెనెస్టీ’గా దీన్ని పిలుచుకుంటారు. ఈ బంగారం హెల్మెంట్ 2,500 ఏళ్ల క్రితం నాటి పుత్తడితో తయారు చేసింది. క్రీస్తుపూర్వం 50వ సంవత్సరంలో దీన్ని తయారు చేసినట్లు చారిత్రకారులు చెబుతున్నారు. దీని బరువు దాదాపు 907గ్రాములు ఉంటుంది. ఈ హెల్మెంట్ ముందు భాగంలో పెద్ద కళ్లను చెక్కారు.. ఎందుకంటే.. దుష్టశక్తుల బారిన పడకుండా కాపడుతుందని ఆనాటి ప్రజలు విశ్వసించేవారు. జంతు వధ చేస్తున్నట్లుగా హెల్మెంట్ వెనుక వైపు చెక్కారు. రోమేనియా సంస్కృతికి సంబంధించి ఇది వెల కట్టలేని ప్రాచీన కళాఖండమని రోమేనియా ప్రభుత్వం పేర్కొంది.

Also Read: అమెరికాలో ట్రంప్ వేట.. గుడి, బడి అని లేదు.. ఇండియన్స్ ఉండే రాష్ట్రాల్లో.. గురుద్వారాల్లో కూడా..

రోమేనియాకు చెందిన ఈ బంగారపు హెల్మెంట్ ను గతేడాది జూలైలో నెదర్లాండ్స్ దేశం తీసుకొచ్చి ఎస్సేన్ నగరంలోని డ్రెంట్స్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంకు 170ఏళ్ల చరిత్ర ఉంది. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య దీన్ని ఉంచినప్పటికీ.. దొంగల ముఠా బాంబులతో తలుపులను బద్దలు కొట్టి మరీ దోచుకెళ్లింది. తమ దేశానికి చెందిన అత్యంత విలువైన పురాతన వస్తువు చోరీకి గురికావడంతో రోమేనియా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. బంగారపు హెల్మెంట్ తోపాటు రాయల్ బ్రేస్లెట్ సహా మూడు వస్తువులనూ దొంగల ముఠా దోచుకెళ్లింది. అయితే, ఈ బంగారపు హెల్మెంట్ ను దొంగిలించిన ముఠాను పట్టుకునేందుకు నెదర్లాండ్స్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.