Toddler : పిల్లిని ముద్దులతో మంచెత్తిన చిన్నారి.. క్యూట్ వీడియో వైరల్..!

Toddler : మీరు జంతు ప్రేమికులా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే... వణికిపోతున్న పిల్లిపిల్లను చూసి ఓ చిన్నారి మనస్సు చలించిపోయింది. వెంటనే పిల్లి దగ్గరకు వెళ్లి తనదగ్గరగా తీసుకుంది.

Toddler : పిల్లిని ముద్దులతో మంచెత్తిన చిన్నారి.. క్యూట్ వీడియో వైరల్..!

This Adorable Video Of A Toddler Showering A Kitty With Kisses Has Over 2 Million Views. Seen It

Updated On : April 19, 2022 / 8:49 AM IST

Toddler : మీరు జంతు ప్రేమికులా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే… వణికిపోతున్న పిల్లిపిల్లను చూసి ఓ చిన్నారి మనస్సు చలించిపోయింది. వెంటనే పిల్లి దగ్గరకు వెళ్లి తనదగ్గరగా తీసుకుంది. అంతటితో ఆగలేదు. ఆ పిల్లిని ముద్దులతో ముంచెత్తింది. పిల్లిని ప్రేమగా నిమురుతూ ముద్దు చేసింది చిన్నారి.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లి పిల్లిని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ వీడియో మిస్ కాకుండా చూడండి అంటూ ఒకరు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. దీనికి బ్యూటెంగేబిడెన్ అనే ట్యాగ్ కూడా జోడించారు.

ఈ వీడియోను ఇప్పటి వరకు 2.5 మిలియన్ల మంది వీక్షించారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో చిన్న పిల్లవాడు పిల్లిని ముద్దులతో ముంచెత్తడం దానిని లాలించడం చూడవచ్చు. సాధారణంగా చిన్నపిల్లలకు భయమనేది తెలియదు.. తాము ఏం చేస్తున్నామో.. దేనితో ఆడుకుంటున్నామో తెలియని పసిప్రాయమిది.

అందుకే అది హాని చేసే జంతువు లేదా మరి ఏదైనా భయం లేకుండా వాటితో ఆడేస్తుంటారు. సాధారణంగా కొంచె ఊహా తెలిసిన పిల్లలు అయితే పిల్లిని చూడగానే భయంతో ఏడ్చేస్తారు లేదంటే పారిపోతారు. కానీ, ఈ చిన్నారి ఆ పిల్లికూనను చూసి ముద్దు చేసింది. ఈ వీడియోను చూసిన వారంతా సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Also : Ram Pothineni: బులెట్ సాంగ్‌ను పట్టుకొస్తున్న వారియర్!