Electronic Nose : మనలో ఉండే వ్యాధుల్ని ఈ (E-)ముక్కు కనిపెట్టేస్తుంది..
మన శరీరంలో ఉండే వ్యాధుల్ని గుర్తించే ముక్కును రూపొందించారు పరిశోధకులు. ఈ ముక్కుని మనం మాస్క్ లాగా ధరిస్తే మనలో ఉండే పలు వ్యాధుల్ని ఈ ముక్కు గుర్తిస్తుంది.

Electronic Nose (1)
Electronic Nose : మనలో ఉన్న వ్యాధుల్ని కనిపెట్టాలంటే డాక్టర్ కెళితే..డాక్టర్ పరీక్షలు చేసి..రిపోర్ట్ వచ్చాక దాన్ని పరిశీలించి చెబుతారు. కానీ టెక్నాలజీ యుగంలో కేవలం ‘ముక్కు’ ద్వారా మనంలో ఉండే రోగాలమిటో తెలుసుకోవచట. పరిశోధకులు ఓ అడుగు ముందుకేసి మనంలో ఉండే రోగాలను కనిపెట్టే ఓ ‘ముక్కు’ను రూపొందించారు బ్రిటన్ పరిశోధకులు.గతంలో ఏదైనా వ్యాధిని నిర్ధారించటానికి పరీక్షలు చేయటం..వాటి రిపోర్టులు రావటానికి కొన్ని రోజులే పట్టేది.కానీ ఇప్పుడలా కాదు.కొత్త వ్యాధులు వస్తున్నాయి. అలాగే కొత్త కొత్త పరికరాలు వస్తున్నాయి. వ్యాధుల్ని గుర్తించానికి రోజులు గంటలు కాదు కేవలం కొన్ని నిమిషాల్లోనే మనలో ఉండే వ్యాధుల్ని గుర్తించటానికి కృషి చేసతున్నారు సైంటిస్టులు. అటువంటిదే బ్రిటన్ పరిశోధకులు కనిపెట్టిన ఈ ‘ముక్కు’. ఈ ముక్కు అంటే ‘ఎలక్ట్రానిక్ ముక్కు’. ఈ ముక్కు సహాయంతో కాలేయం, ఊపిరితిత్తులు, పెద్దప్రేగులకు సంబంధించివాటితో పాటు సుదీర్ఘ వ్యాధి అయిన కాన్సర్ మహమ్మారిలాంటి వ్యాధుల్ని కూడా ఈ ముక్కుతో గుర్తిస్తుందంటున్నారు పరిశోధకులు.
ఈ (E)- ముక్కును మన ముక్కుపై మాస్క్‌లాగా అప్లై చేస్తే మన శరీరంలో ఉన్న పలు వ్యాధులను ఇట్టే గుర్తించవచ్చునంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ సహకారంతో బ్రిటన్‌లోని వివిధ హాస్పిటల్స్ లో 4000 మంది రోగులపై ట్రయల్స్ నిర్వహించి విజయవంతమైన ఫలితాలు అందుకున్నారు పరిశోధకులు. దీంతో ఈ ముక్కు ద్వారా ఇక రోగాలకు గుర్తించి వెంటనే చికిత్సనందించవచ్చిని తద్వారా మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు. కాగా..Electronic Noseని అభివృద్ధి చేయటానికి శాస్త్రవేత్తలకు 51 సంవత్సరాలు పట్టడం విశేషం.
Read more : తుమ్ము వస్తే ఆపుకున్నాడు.. మెడ ఎముక విరిగి ఆస్పత్రి పాలయ్యాడు!
బ్రిటన్‌కు చెందిన బయోటెక్ కంపెనీ ఔల్‌స్టోన్ మెడికల్ Electronic Noseను తయారు చేసింది. సాధారణంగా రోగికి రక్తం, మూత్రం, మలం నమూనాలను ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కానీ ఈ కొత్త పరీక్ష వల్ల రోగులు ఏమాత్రం ఇబ్బంది పడే పనిలేదు. చాలా ఈజీగా పరీక్షలు చేసేయవచ్చు. పైగా ఎంతో సమయం ఆదా అవుతుంది. వ్యాధి నిర్ధారణ అయిపోతే వెంటనే చికిత్స కూడా తీసుకోవచ్చు.
Electronic Nose ఎలా పనిచేస్తుందంటే..
రోగి శ్వాస నుంచి వచ్చే వ్యాధి వాసనలను గుర్తించడం ద్వారా Electronic Nose వారి శరీరంలో ఉండే వ్యాధిని గుర్తిస్తుంది. మనం ఊపిరి పీల్చినప్పుడు, అందులో 3,500 కంటే ఎక్కువ వోలాటైల్ ఆర్గానిక్ కాంపౌడ్స్ అంటే అస్థిరమైన సేంద్రీయ సమ్మేళనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిలో చాలా చిన్న గ్యాస్ రేణువులు, సూక్ష్మ బిందువులు ఉంటాయి. ఈ-ముక్కు ఈ అస్థిరమైన సేంద్రీయ సమ్మేళనాల్లో ఉండే రసాయనాలను గుర్తించడం ద్వారా వ్యాధులను గుర్తించి నిర్ధారిస్తుంది.
Electronic Nose తయారీకి 51 ఏళ్ల సమయం..
Electronic Nose రూపొందించడానికి శాస్త్రవేత్తలకు దాదాపు 51 సంవత్సరాల సమయం పట్టింది. 1970 లో అభివృద్ధి చేయాలనే ఆలోచన చేశారు.కానీ ఆ ఆలోచనను సున్నితమైన పరికరంగా మార్చడానికి వోలాటైల్ ఆర్గానిక్ కాంపౌడ్స్ గుర్తించడానికి ప్రోగ్రామింగ్, సెన్సార్ రూపకల్పనకు ఇన్ని దశాబ్దాల కాలం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో Electronic Nose పనివిధానాన్ని పరీక్షిస్తున్నారు.
Read more : Ashwagandha: ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధ
ఈ క్రమంలో ఈ Electronic Nose అందుబాటులోకి రావాలంటే మరో ఐదేళ్లు పట్టవచ్చు. Electronic Nose ద్వారా చేసే పరీక్ష సాధారణ పరీక్షలాగా మారుతుందని నిపుణులు అటున్నారు. వ్యాధిని గుర్తించిన తర్వాత రోగికి ఏ మెడిసిన్ అవసరమో కూడా ఈ పరికరం తెలియజేసేలా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.