Beautiful tourist place : అక్కడ సెల్ఫీ క్లిక్ చేశారా అంతే .. భారీ మూల్యం తప్పదు
అక్కడ సెల్ఫీలు దిగితే రంగు పడుద్ది..జేబులు ఖాళీ అవుతాయి. లేదు లొకేషన్ చూసి టెంప్ట్ అయి సెల్ఫీ క్లిక్ మనించారా?ఇక అంతే సంగతులు..

photography hotspots Portofino
Beautiful tourist place : మీకు సెల్ఫీలు అంటే ఇష్టమా? ఫ్రెండ్స్ తో, బ్యూటీఫుల్ లొకేషన్ కనిపించినా సెల్ఫీ క్లిక్ మనిపిస్తారా? ఓకే కానీ ఎక్కడైనా సెల్ఫీ ఓకేనేమో గానీ అక్కడ మాత్రం సెల్పీ నాట్ ఓకే. అక్కడ సెల్ఫీ క్లిక్ మనింపించారో మీని అంతే..సెల్ఫీ ఎలా వచ్చిందో చూసుకునేలోపు మీ జేబులే కాదు బ్యాంక్ ఎకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ సెల్ఫీ తీసుకోవటంపై నిషేధం ఉంది. ఇటలీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పోర్టోఫినో సిటీలో సెల్ఫీ దిగారో రూ.25వేలు ఫైన్ కట్టాల్సిందే..
ఇటలీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పోర్టోఫినో సిటీ కూడా ఒకటి..ఈ నగరంలో రెండు ప్రాంతాలను చూసామంటే ఫోటో క్లిక్ మనించకుండా ఉండలేం. ఇక సెల్ఫీ ప్రియులు ఊరికనే ఉంటారా మరి..వావ్ భలే ఉంది అంటే క్లిక్ మనించేద్దామనుకుంటారు. కానీ అలాచేస్తే 275 యూరోలు అంటే దాదాపు భారత కరెన్సీలో రూ.25వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో సెల్పీలు దిగకుండా రెడ్ జోన్లుగా ప్రకటించారు నగర మేయర్.
ముదురు రంగు భవనాలు, మరియు ఐకానిక్ హార్బర్ ప్లేస్ సెల్ఫీలు దిగకూడదని ప్రకటించారు నగర మేయర్ మాటియో వయాకవా ఈ రెండుచోట్ల సెల్ఫీల కోసం పర్యాటకులు ఆసక్తిచూపిస్తుంటారు. దీంతో ఆ రెండుచోట్లా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఉదయం ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే వారు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సెల్ఫీలు తీసుకోవద్దని మేయర్ మాటియో వయాకవా ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సెల్ఫీలు దిగకూడదు. ఈ నిబంధన అతిక్రమించి సెల్ఫీలు తీసుకుంటే 275 యూరోలు అంటే దాదాపు రూ.25వేలు జరిమానా విధిస్తామని ప్రకటించారు. ఈ కొత్త రూల్ అమలుతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు బాగా తగ్గాయి అంటున్నారు స్థానికులు. కాగా పోర్టోఫినో అనేది చిన్న నగరం. జనాభా కేవలం 500లు మాత్రమే. అయినా ఇది ఇటలీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.